ఆ హీరోతో కియారా అద్వానీ బైక్ రైడ్.. నా కన్నా పెద్దే, కానీ వయసైపోలేదు!
Recommended Video

కైరా అద్వానీ, షాహిద్ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం కబీర్ సింగ్. తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగానే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. సందీప్ వంగా ఈ చిత్రాన్ని నార్త్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా కథలో చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ, షాహిద్ కపూర్ షూటింగ్ సందర్భంగా బైక్ పై ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
వణికించే చలిలో
కబీర్ సింగ్ చిత్ర యూనిట్ ఢిల్లీ నగరంలో వణికించే చలిలో షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో కియారా, షాహిద్ కపూర్ సరదాగా బైక్ పై షికారు చేసిన వీడియో వైరల్ అవుతోంది. చలిని కూడా లెక్క చేయకుండా కియారా, షాహిద్ కపూర్ జోకులు వేసుకుంటూ బైక్ రైడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సందీప్ వంగ ప్రస్తుతం షాహిద్ కపూర్, కియారా మధ్య కాలేజీ సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది.

అంత ఓల్డ్ కాదు
కియారా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాహిద్ కపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షాహిద్ కపూర్ నా కన్నా చాలా సీనియర్. అలాగని ఆయన చిత్రాలు చూస్తూ పెరిగానని చెప్పను. ఎందుకంటే షాహిద్ అంతా ఓల్డ్ ఏమీ కాదు. కానీ కబీర్ సింగ్ చిత్రంలో హీరోగా షాహిద్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేను అని కియారా తెలిపింది. కియారా అద్వానీ కంటే షాహిద్ కపూర్ 12 ఏళ్ళు పెద్ద వాడు.

మద్యానికి బానిసగా
మద్యానికి బానిసగా మారిన ఓ డాక్టర్ ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా మాట్లాడుతూ ఈ చిత్రంలో గ్లామరస్ గా కనిపించాల్సిన అవసరం లేదు. ఓవర్ గా మేకప్ వేసుకోవాల్సిన పని కూడా లేదు. నాచురల్ లుక్ లో కనిపిసిస్తే సరిపోతుంది. ఈ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది అని కియారా తెలిపింది. గంటల తరబడి మేకప్ వేసుకునే తలనొప్పి ఈ చిత్రం విషయంలో ఎదురు కాలేదని తెలిపింది.

రిలీజ్ ఎప్పుడంటే
కబీర్ సింగ్ చిత్రాన్ని జూన్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించారు. తెలుగులో తిరుగులేని విజయం సాధించడంతో హిందీ, తమిళ నిర్మాతల ద్రుష్టి ఈ చిత్రంపై పడింది. తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తున్నాడు. తమిళంలో వర్మగా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











