For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kiara Advani కి చెప్పలేని చోట ప్లాస్టిక్ సర్జరీ.. ఆ విషయం చెప్పాలంటే భయం అంటూ..

  |

  బాలీవుడ్ నటి కియారా అద్వానీ తాజాగా నటించిన సినిమా షేర్‌షా రిలీజ్ కావడంతో ఆమె కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా సూపర్‌హిట్ సినిమాల్లో భాగం అయిన ఆమె బాలీవుడ్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కియారా అద్వానీ తన చిన్న బాలీవుడ్ కెరీర్‌లో అక్షయ్ కుమార్‌తో పాటు షాహిద్ కపూర్‌తో రెండుసార్లు పని చేసింది. కానీ ఇంత విజయవంతం అయిన తర్వాత కూడా, కియారా అద్వానీ తనను తీవ్రంగా ట్రోల్ చేసే ట్రోలర్‌ల బారిన పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఈ అంశం మీద నోరు విప్పింది ఆ వివరాల్లోకి వెళితే

  నాకే డౌట్ తెప్పించారు

  నాకే డౌట్ తెప్పించారు

  త్వరలో కియారా అర్బాజ్ ఖాన్ యొక్క 'పిచ్ బై అర్బాజ్ ఖాన్' షోలో కనిపించబోతోంది, ఈ షోలో పాల్గొన్న ఆమె ఈ అంశం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అర్బాజ్ ఖాన్ చాట్ షో పించ్ సీజన్ 2 లో సోషల్ మీడియా ట్రోలింగ్‌లో చాలా విషయాలు చెప్పారు. కియారా అద్వానీ చాలాసార్లు తాను ట్రోలర్‌లను పట్టించుకోనని చెప్పింది.

  కానీ కొన్ని వ్యాఖ్యలు నన్ను మానసికంగా గాయపరిచాయని అన్నారు. ప్లాస్టిక్ సర్జరీ కోసం ట్రోల్ విషయంలో ఆమె మాట్లాడుతూ "నేను ఒక ఈవెంట్ కోసం వెళ్లాను, ఆ తరువాత సోషల్ మీడియాలో వచ్చిన ఆ ఈవెంట్ ఫోటోల విషయంలో కొన్ని కామెంట్స్ లో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అని అన్నారని, కొన్నాళ్ళకు ఆ విషయాలు నేనే నమ్మడం మొదలుపెట్టాను, అది నేనే చేసిన పని అనుకునేదానిని అని పేర్కొన్నారు.

  వాళ్ళెవరు చెప్పడానికి

  వాళ్ళెవరు చెప్పడానికి

  ఇక అర్బాజ్ ఖాన్ ఒక పోస్ట్‌పై చేసిన కామెంట్ చదివి, అందులో "కియారా ఇకపై సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌తో ఏ సినిమాకి సంతకం చేయకూడదు .." అని అన్నారు. ఈ కామెంట్ పై, కియారా ఇలా అన్నారు, "మన సరిహద్దులను మనం ఎక్కడ గీయాలి అని మనకు తెలుసు. కొన్నిసార్లు మనం ఈ రకమైన ట్రోలింగ్‌తో ప్రభావితమవుతామని, నేను దానిని విస్మరించానని చెప్పినప్పటికీ, మనల్ని మనం రక్షించుకోవడానికి ఇది ఒక మార్గం " అని ఆమె చెప్పుకొచ్చారు.

  వాళ్ళకు ఫోజులు ఇవ్వకపోతే అంతేనా

  వాళ్ళకు ఫోజులు ఇవ్వకపోతే అంతేనా

  అర్బాజ్ కియారాకు మరో ట్రోలర్ కామెంట్ చదివి వినిపించాడు, ఇందులో పాపరాజ్‌లు ఆమె అహంకారంతో సరిగా ఫోజులు ఇవ్వలేదని చెప్పబడింది. దీనిపై కియారా క్లారిటీ ఇస్తూ నేను కొన్ని సెకన్ల పాటు నిలబడి, పోజులిచ్చాను, అయినా ఫోటోగ్రాఫర్లకు గ్యాప్ వచ్చింది, కాబట్టి నేను ఆలస్యం చేశానని అనుకున్నాను మరియు నేను వేరొకరి కోసం ఎదురు చూస్తున్నానని, వారు రాగానే నేను బయలుదేరడం మొదలుపెట్టాను కానీ వాళ్ళు ఇలా కామెంట్ చేశారని అంటున్నారు.

  వాళ్ళు చదువుతారుగా

  వాళ్ళు చదువుతారుగా

  ఇక నేను అస్సలు ఫోటోలు వద్దు అని అంటే అహంకారి అనొచ్చు కానీ మీరు చూసేది మొత్తం నిజం కాదని, మీరు అందరినీ మెప్పించలేరు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్పేస్ ను గౌరవించాలని అన్నారు. ఆలోచించకుండా అలాంటి నిర్ధారణలకు వెళ్లవద్దని పేర్కొన్నారు. ట్రోలింగ్ తన మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తుందని ఒప్పుకున్న కియారా తన తల్లిదండ్రులు సోషల్ మీడియాలో తన గురించి కామెంట్స్ చదివారని కియారా చెప్పారు. నటి, "నేను ట్రోల్‌లను పట్టించుకోకపోయినా, నా తల్లి దానిని చదువుతుందని నేను అనుకుంటున్నాను, మా నాన్న దానిని చదువుతారని ఆయన వాటిని ఇష్టపడడని అన్నారు.

  Tollywood లో Anirudh Ravichander హవా, అదొక్కటే ఛాలెంజ్..| NTR 30 || Filmibeat Telugu
  వాళ్ళని టాగ్ చేయాలంటే భయం

  వాళ్ళని టాగ్ చేయాలంటే భయం

  దీని తర్వాత కియారా సోషల్ మీడియా ట్రోలింగ్‌లో మాట్లాడుతూ, నా కజిన్స్ సోషల్ మీడియాలో ఉన్నారు, చాలా సార్లు నేను వారి కోసం భయపడుతున్నా. నా హ్యాండిల్‌లో వారి పుట్టినరోజు చిత్రాలను పోస్ట్ చేయడానికి నేను భయపడుతున్నాను ఎందుకంటే నా ఫాలోవర్స్ మరియు ట్రోలర్లు వారి గురించి వ్యతిరేకంగా కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు.

  నా కారణంగా నా కుటుంబం ట్రోలింగ్‌ని ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు. అర్బాజ్ మీ అర్ధరాత్రి సోషల్ మీడియా స్నేహితులు ఎవరు? కరణ్ జోహార్, సిద్ధార్థ్ మల్హోత్రా లేదా వరుణ్ ధావన్ లలో ఎవరు అని కియారాను అడిగారు. కియారా మాట్లాడుతూ, ఈ ముగ్గురూ అర్థరాత్రి వరకు సోషల్ మీడియాలో 100% ఆన్‌లైన్‌లో ఉంటారు, కాబట్టి నేను వారిని అర్థరాత్రి కాల్ చేయవలసి వస్తే, సమస్య ఉండదని పేర్కొంది.

  English summary
  On Arbaaz Khan's show Pinch, Kiara Advani hit back at trolls attacking her on her film choices, looks, and family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X