ఆ హీరో అలా నా పేరు చెరిపేశాడు.. ఇప్పటికీ నా తల్లిదండ్రులు.. కియారా అద్వాని
బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్న కియారా అద్వానీ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. కళంక్ చిత్రంతో నటిగా మంచి పేరు సంపాదించుకొన్న కియారా భారీ చిత్రాల్లో నటిస్తున్నది. వెబ్ సిరీస్‌లతోపాటు యాడ్ ప్రమోషన్లలో కూడా రాణిస్తున్నది. అయితే సినిమాల్లోకి వచ్చాక సల్మాన్ ఖాన్ తన పేరు మార్చాడనే విషయాన్ని వెల్లడించారు. కియారా అసలు పేరేంటి? ఆమె పేరు మారడానికి కారణమేమిటంటే..
సినిమాల్లోకి ప్రవేశించిన సమయంలో కియారా అసలు పేరు అలియా. అప్పటికే ఇండస్ట్రీలో అలియా పేరు ఉంది. ఒకే పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉండకూడదు. దాంతో నా పేరు మార్చుకోమని సల్మాన్ ఖాన్ సలహా ఇచ్చారు. సల్మాన్ సలహా మేరకు నేను పేరు మార్చుకొన్నాను. అయితే ఆయన ఎలాంటి పేరు సూచించలేదు. కియారా అని నేనే పేరు పెట్టుకొన్నాను. ఇప్పటికి నా తల్లిదండ్రులు కియారా అని పిలవడం లేదు అని కియారా తెలిపారు.

బాలీవుడ్‌లో కియారా అద్వానీ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నది. అర్జున్‌రెడ్డి రీమేక్ కబీర్ ఖాన్ చిత్రంలో షాహీద్ కపూర్‌తో కలిసి నటిస్తున్నది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 21న రిలీజ్ అవుతున్నది. అలాగే అక్షయ్ కుమార్ సరసన గుడ్ న్యూస్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో కరీనా కపూర్, దిల్జిత్ దోసంజ్ నటిస్తున్నారు. అలాగే కాంచన సినిమా రీమేక్‌లో అక్షయ్ కుమార్ సరసన మరోసారి జతకట్టింది. ఈ సినిమాకు లారెన్స్ రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











