Kiara Advani: మీ అమ్మ నిన్ను ఇంకా వర్జిన్​ అనే అనుకుంటుందా? బెడ్​రూమ్​లో ఆటలు ఆడలేదా?

కరణ్ జోహార్​.. హిందీ చిత్రసీమలో ప్రముఖ దర్శక దిగ్దజం. అంతేకాకుండా సక్సెస్​ఫుల్​ నిర్మాత కూడా. ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈయన హోస్ట్​గా వ్యవహరిస్తూ విజయవంతంగా దూసుకుపోతున్న టాక్ షో కాఫీ విత్ కరణ్. ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్​ షో ప్రస్తుతం ఏడో సీజన్​ కొనసాగుతోంది.

ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలను రోస్ట్ చేస్తూ వారి నుంచి ఎంతో ఆసక్తికర, షాకింగ్​ విషయాలను బయటపెడుతుంటాడు. ఇప్పటికే ఈ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్​, సారా అలీ ఖాన్​ ఇద్దరు అన్నదమ్ములను డేటింగ్​ చేసిన విషయాన్ని రాబట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీని పలు కామెంట్స్​తో ఇబ్బందిపెట్టాడు ఈ నిర్మాత.

కాఫీ విత్ కరణ్​ షో.. సెలబ్రిటీల పర్సనల్​ విషయాలను లాగడమో లేదా బయటపెట్టడమే లక్ష్యంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏ సెలబ్రిటీ వచ్చినా సరే వారి బెడ్​రూమ్​ ముచట్లు, రిలేషన్​షిప్​ వ్యవహారాలు, లైంగిక జీవితం వంటి వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలే వేస్తుంటాడు కరణ్​.

2005లో ప్రారంభం..

2005లో ప్రారంభం..

2005లో టెలివిజన్​ ద్వారా ప్రారంభమైన కాఫీ విత్​ కరణ్ షో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్​ అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఇప్పటికే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, సమంత, అక్షయ్​ కుమార్, విజయ్​ దేవరకొండ, అనన్య పాండే, కరీనా కపూర్​, సిద్ధార్థ్​ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.

హీటైన ప్రశ్నలు..

హీటైన ప్రశ్నలు..

తాజాగా ఈ షోలో కబీర్​ సింగ్​ జోడి కియారా అద్వానీ, షాహిద్ కపూర్​ సందడి చేసింది. వీరిని సోఫాలో కూర్చొబెట్టి మరి తన హీటైన క్వశ్చన్స్​తో కియారాకు చెమటలు తెప్పించాడు. 'నువ్​ బెడ్​రూమ్​లో దొంగా పోలీసు వంటి ఆటలు ఆడలేదా?' అని కియారాను అడిగాడు కరణ్​.

 మా అమ్మ చూస్తుంది..

మా అమ్మ చూస్తుంది..

ఈ ప్రశ్నతో షాక్​కు గురైన కియారా అద్వానీ కొంత ఇబ్బందిగా చూస్తూ 'మా అమ్మ ఈ ఎపిసోడ్​ చూస్తుంది' అని సమాధానమిచ్చింది. అయినా వెనక్కు తగ్గని కరణ్​ జోహార్​.. 'అయితే ఏంటీ? మీ అమ్మ నువ్​ ఇంకా వర్జన్​వనే అనుకుంటుందా.. ఎంటీ?' అని మొహమాటం లేకుండా అడిగేశాడు.

తెలివిగా దాటేసినా కియారా..

తెలివిగా దాటేసినా కియారా..

దీంతో 'నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా' అని బదులిచ్చింది కియారా అద్వానీ. తర్వాత 'నువ్​ సిద్ధార్థ్​తో రిలేషన్​లో లేవా?' అని అడగ్గా.. 'అవుననీ చెప్పను, అలా అని కాదనీ చెప్పలేను' అని తెలివిగా ప్రశ్నను దాటవేసింది.

చూడముచ్చటైన జంట..

చూడముచ్చటైన జంట..

అనంతరం 'మరి మీరు క్లోజ్​ ఫ్రెండ్సా?' అని కరణ్​ ప్రశ్నించగా, 'క్లోజ్​ ఫ్రెండ్స్​ కంటే కూడా ఎక్కువ' అని తెలిపింది కియారా అద్వానీ. ఈ సమాధానం తర్వాత 'వీళ్లిద్దరిదీ చూడముచ్చటైన జంట. ఏ సమయంలో ఏ న్యూస్​ వింటామో తెలియదు' అని షాహిద్ కపూర్ అంటాడు.

షేర్షా మూవీ నుంచి..

ప్రస్తుతం సత్య ప్రేమ్​ కీ కథ అనే సినిమాలో నటిస్తోంది కియారా అద్వానీ. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. కాగా కియారా అద్వానీ, సిద్ధార్థ్​ మల్హోత్రా కలిసి షేర్షా నటించినప్పటి నుంచి వారి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పుకార్లు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X