కియారా అద్వానీ డ్రస్‌పై దారుణమైన కామెంట్స్.. ట్రోల్స్‌కు మైండ్ బ్లోయింగ్ జవాబు
అందాల తార కియారా అద్వానీ వరుస సినిమాలో దుమ్మురేపుతున్నారు. అంతేకాకుండా కబీర్ సింగ్ విజయంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ముంబైలో పార్టీ, పబ్‌లలో హోరెత్తిసున్న ఈ అందాల భామను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె ఇటీవల చేసిన ఫోటోషూట్ సందర్భంగా ధరించిన డ్రస్స్‌పై కామెంట్స్ చేయడం మీడియాలో హాట్‌గా మారింది.

మ్యాగీ నూడుల్స్ డ్రస్ అంటూ
ఇటీవల జరిగిన ఓ ఫోటోషూట్ సందర్భంగా పసుపు పచ్చని డ్రస్ ధరించి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ డ్రస్‌కు ఈకలు, సన్నటి దారం పోసలు ఉండటంతో మ్యాగీ నూడల్స్‌తో చేసిన డ్రస్ ధరించావా? అని కియారాను ప్రశ్నించారు. అయినా ఆమె సహనంతో వ్యవహరించారు.

ఫుడ్ వేస్ట్ చేయకండి
మ్యాగీ నూడుల్స్ ఎంత ఇష్టమైనా గానీ ఇలాంటి డ్రస్‌ను ధరిస్తావా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ ఎంత మ్యాగీ ఇష్టం లేకపోతే మాత్రం అలాంటి వాటితో చేసిన డ్రస్‌ను ధరిస్తావా. మీరు ఫుడ్‌ను వేస్ట్ చేయకండి అంటూ కామెంట్ చేశాడు. అలా తమకు తోచిన విధంగా కామెంట్ చేస్తూ ట్రోల్ చేశారు.

మ్యాగీలా నేను కూడా రెండు నిమిషాల్లో
తాను ధరించిన ఎల్లో డ్రస్ గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసినా గానీ.. కియారా అద్వానీ సహనం కోల్పోలేదు. అంతేకాకుండా వాటిని స్పోర్టివ్‌గా తీసుకొని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. మీరు ఏమన్నా పట్టించుకోకుండా రెండు నిమిషాల్లో మ్యాగీలా తయారై వచ్చాను చూసుకో అంటూ రివర్స్ గేర్ వేసింది.

కియారా అద్వానీ కెరీర్
తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ తర్వాత సినిమాలు అంగీకరించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా మారిపోయింది. తాజాగా కబీర్ సింగ్ విజయం తర్వాత కుప్పులు తెప్పలుగా వస్తున్న ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అక్షయ్ కుమార్‌తో గుడ్ న్యూస్, లక్ష్మీబాంబ్, షేర్సా సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ నటించే సినిమాలో కూడా కియారా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











