మీడియాకు కియారా-సిద్ధార్థ్ స్పెషల్ గిఫ్ట్.. గ్రాండ్ గా రిసెప్షన్.. సల్మాన్ ఖాన్ తప్పా వాళ్లందరూ!
హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు బ్యూటిఫుల్ కియారా అద్వానీ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా. వీళ్లిద్దరి మధ్య డేటింగ్, లవ్ అఫైర్స్ వంటి రూమర్స్ ఎన్నో వచ్చాయి. వాటిని వాళ్లు ఖండిస్తూ వచ్చిన ఎట్టకేలకు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముందుగా ఫిబ్రవరి 6న అనుకున్న కియారా అద్వానీ-సిద్ధార్థ్ పెళ్లి ఒక్క రోజు ఆలస్యంగా 7వ తేదిన జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య రాజస్థాన్ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలు అయ్యారు ఈ లవ్ బర్డ్స్. పెళ్లయిన తర్వాత శనివారం రాత్రి ముంబైకి చేరుకున్న ఈ కొత్త జంట బంధుమిత్రుల కోసం గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ అరేంజ్ చేసింది. ఆ పార్టీ ఎక్కడ? వేడుకకు ఎంతమంది అతిథులు వస్తున్నారనే వివరాల్లోకి వెళితే..

గ్రాండ్ గా సంగీత్ కార్యక్రమం..
బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పిలుస్తున్న కియారా-సిద్ధార్థ్ ల వివాహం ఫిబ్రవరి 7న ఘనంగా జరిగింది. అందుకు రాజస్థాన్ లోని జైసల్మీర్ ప్రాతంలో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్ హోటల్ వేదికగా మారింది. కియారా, సిద్ధార్థ్ పెళ్లి కంటే ముందు ప్రీ వెడ్డింగ్ పనులతో సందడి నెలకొంది. ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు అలరించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4, 5 తేదిలలో హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను నిర్వహించారు.

సినీ సెలబ్రిటీలో డ్యాన్సులతో..
సూర్యఘర్ ప్యాలెస్ లో సంగీత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో హాజరైన సినీ సెలబ్రిటీలు తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా సినిమా పాటలకు స్టెప్పులు వేసినట్లు సమాచారం. ఈ వేడుకలో బాలీవుడ్ సినీ ప్రముఖులు కరణ్ జోహార్, షాహిద్ కపూర్-మీరా కపూర్ కాలా చష్మా, డోలారే డోలా వంటి పాటలకు తమ నృత్యాలతో అలరించారు.

పాపులర్ బ్యాండ్.. రథాలపై వధూవరులు..
ఇక సిద్ధార్థ్ మల్హోత్ర-కియారా అద్వానీ వివాహానికి భారీగా ఏర్పాట్లు జరగ్గా.. ముందుగా అనుకున్న ఫిబ్రవరి 6వ తేదిన కాకుండా ఒక్క రోజు ఆలస్యంగా 7న పెళ్లి జరిగింది. రాజస్థాన్ సాంప్రదాయం ప్రకారం హిందూ మతాచారం పద్ధతుల్లోనే ఈ ప్రేమ జంట పెళ్లి ఘనంగా జరిగింది. సంగీత్ కార్యక్రమాలు భారీ డీజే ట్రక్కులను ఏర్పాటు చేసినట్లుగానే పెళ్లి ఊరేగింపు కోసం రాజస్థాన్ లోని పాపులర్ బ్యాండ్ ను తెప్పించారట. ఇక పూలతో అలంకరించిన రథాలను ఏర్పాటు చేసి నూతన వధూవరులను ఊరేగించారని సమాచారం.

రాత్రి 8 నుంచి ప్రారంభం..
జైసల్మేర్ లో వివాహం అనంతంర ఫిబ్రవరి 11న అంటే శనివారం రాత్రి ముంబై చేరుకున్నారు కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా. అనంతరం ఢిల్లీలోని బంధువులను కలుసుకున్నారు. ఇక ఆదివారం అంటే ఫిబ్రవరి 12న ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ముంబైలోని లోయర్ పరేల్ లోని సెయింట్ రేగిస్ హోటల్ లో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి ఈ పార్టీ ప్రారంభమవుతుంది. ఈ పార్టీకి సిద్ధార్థ్ , కియారా కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు రానున్నారు.

బాలీవుడ్ సెలబ్రిటీలు..
కియారా-సిద్ధార్థ్ పెళ్లికి షాహిద్ కపూర్, మీరా కపూర్, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్ర, జూహీ చావ్లా, అర్మాన్ జైన్ వంటి అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరుకావడంతో.. రిసెప్షన్ పార్టీకి మాత్రం ఇండస్ట్రీలోని స్నేహితులందరినీ ఆహ్వానించినట్లు సమాచారం. రిసెప్షన్ గెస్టుల జాబితాలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, రణ్ బీర్ కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, పరిణితీ చోప్రా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

సల్మాన్ ఖాన్ తప్పా..
సిద్ధార్థ్ రిసెప్షన్ కు పెళ్లికి హాజరైన సెలబ్రిటీలు కూడా హాజరు కానుండగా.. సల్మాన్ ఖాన్ మాత్రం రాకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ 16 గ్రాండ్ ఫినాలేను వేరొక ప్రాంతంలో హోస్ట్ చేస్తున్నందున కుదరకపోవచ్చని బాలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఇదిలా ఉంటే శనివారం నాడు తమ ముంబై నివాసంలో నుంచి బయటకు వచ్చిన సిద్ధార్థ్-కియారా జంట మీడియా, ఫొటోగ్రాఫర్స్ కు పోజులిచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ కొత్త పెళ్లి జంట అక్కడున్న మీడియా వాళ్లకు, ఫొటోగ్రాఫర్స్ కు గిఫ్ట్ ప్యాక్ చేసిన స్వీట్ బాక్స్ లను బహుమతులుగా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











