చరణ్ హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి.. చేరుకున్న సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్.. అతిథులు ఎవరంటే?
సినిమా అనే రంగుల ప్రపంచంలో సెలబ్రిటీల పెళ్లిళ్లు సర్వసాధారణమే. ముఖ్యంగా హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ సెలబ్రిటీలు జోడీగా మారి వివాహంతో ఒక్కటవుతున్నారు. ఇప్పటికే రాజ్ కుమార్ రావ్-పత్రలేఖ, విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్, రణ్ బీర్ కపూర్-అలియా భట్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బాలీవుడ్ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. అదే కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా జోడి. వీరి వివాహానికి అంతా సిద్దం కాగా వారిని అందంగా అలంకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరికి మెహందీ వేసేందుకు ప్రముఖ సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణ నగ్దా రాజస్థాన్ చేరుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగులో సందడి చేసిన ముద్దుగుమ్మ..
తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో బాలీవుడ్ బ్యూటి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ చిత్రంలో సందడి చేసింది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. వినయ విధేయ రామ సినిమాలో కాస్తా గ్లామర్ ఒలకబోసిన ఈ మూవీ అంతగా హిట్ సాధించలేదు. దీంతో బాలీవుడ్ వైపుకు పయనించింది ఈ బ్యూటి.

పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు..
హిందీలో అనేక చిత్రాల్లో నటించి సూపర్ హిట్లు కొట్టింది గ్లామరస్ బ్యూటి కియారా అద్వానీ. ఇటీవలే గోవిందా మేరా నామ్ సినిమాతో నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో హీరో విక్కీ కౌశల్ కు హాటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ గా అలరించింది. అలాగే తెలుగులో మళ్లీ రామ్ చరణ్ సరసన RC15 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే చాలా కాలంగా సిద్ధార్థ్ మల్రోత్రా, కియారా అద్వాని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ తెగ వచ్చాయి.

నిజమైన రూమర్స్..
సిద్ధార్థ్, కియారా జంటకు సంబంధించిన పెళ్లి వార్తలు చాలా వైరల్ అవుతూ వచ్చాయి. కానీ ఎప్పుడూ కూడా ఆ విషయంపై మాత్రం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే వారు బ్రేకప్ చెప్పుకున్నారని.. విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకార్లే అని తర్వాత అందరికి క్లారిటీ వచ్చింది. ఒకానొక సమయంలో తాను ఎవరినీ ప్రేమించట్లేదు అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. అయినా వార్తలు వాళ్ల డేటింగ్ వార్తలు ఆగలేదు. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి.

ఫిబ్రవరి 6న వివాహం..
బ్యూటిఫుల్ భామ కియారా అద్వానీ పెళ్లి యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి డేట్, వేదిక ఫిక్స్ అయిందని అప్పట్లోనే వార్తలు వినిపించాయి. ఇప్పుడ్ అదే నిజం కాబోతుంది. బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పిలుస్తున్న కియారా-సిద్ధార్థ్ ల వివాహం ఫిబ్రవరి 6న జరగనుంది. అందుకు రాజస్థాన్ లోని జైసల్మీర్ ప్రాతంలో ఉన్న సూర్య గఢ్ ప్యాలెస్ హోటల్ వేదికగా మారనుంది. కియారా, సిద్ధార్థ్ ఫిబ్రవరి 6న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానుండగా.. అప్పుడే ప్రీవెడ్డింగ్ పనులు మొదలయ్యాయి.

ప్రముఖ సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్..
బాలీవుడ్ బ్యూటిఫుల్ జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా ప్రీ వెడ్డింగ్ పనులు ఫిబ్రవరి 4 నుంచే స్టార్ట్ కానున్నాయి. ఫిబ్రవరి 4, 5 తేదిలలో హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇక ఈ జోడి మెహందీ కోసం ప్రముఖ సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణ నగ్దా ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఎవరెవరు వస్తున్నారంటే..
ఫ్లైట్ ఎక్కడానికి ముందు ముంబయి ఎయిర్ పోర్టులో దిగిన ఫొటో, తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినల్ 2 వద్ద దిగిన ఫొటోను పంచుకున్నారు. అందులో బిగ్ ఫ్యాటి ఇండియన్ వెడ్డింగ్, రాజస్థాన్ పిలుస్తోంది అని రాసుకొచ్చారు. అనంతరం రాజస్థాన్ లో ల్యాండ్ అయిన మరో ఫొటోను షేర్ చేశారు. అంటే బ్యూటిఫుల్ కియారా అద్వానీని మరింతగా అందంగా తయారు చేయనున్నారు మెహందీ ఆర్టిస్ట్ వీణ నగ్దా. ఇదిలా ఉంటే ఈ జంట పెళ్లి కోసం జైసల్మేర్ లోని రాయల్ సూర్యగఢ్ ప్యాలెస్ హోటల్ ను బుక్ చేసుకున్నారు. ఈ వివాహానికి షాహిద్ కపూర్, కరణ్ జోహార్, వరుణ్ ధావన్ వంటి ప్రముఖులు హాజరు కానుండగా.. హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











