Kiara Wedding: కీయరా అద్వానీ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్.. వారికి మాత్రమే సీక్రెట్ ఇన్విటేషన్!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న వారిలో కీయరా అద్వానీ ఒకరు. బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు అందుకునే ప్రయత్నం చేసింది. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ కు చెందిన యువ హీరోని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ నేడు పెళ్లి కి ఆమె రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుకకు ప్రముఖ టాలీవుడ్ తారలు కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇక వాళ్ళు ఎవరూ అనే వివరాల్లోకి వెళితే..

ప్రేమ విషయంలో..

ప్రేమ విషయంలో..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే తన రేంజ్ ను పెంచుకుంటున్న బ్యూటిఫుల్ హీరోయిన్ కీయరా అద్వానీ గత కొంతకాలంగా సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉంది అని కథనాలు వెలువడుతున్నాయి. అయితే చాలాసార్లు మీడియా రిలేషన్షిప్ పై ప్రశ్నలు వేసినప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేదు అని, మేమిద్దరం కూడా మంచి స్నేహితులమని వివరణ ఇచ్చారు. సిద్ధార్థ మల్హోత్రా కూడా అదే తరహాలో వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

పెళ్లి వేడుకకు డేట్ ఫిక్స్

పెళ్లి వేడుకకు డేట్ ఫిక్స్

అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అని బాలీవుడ్ మీడియాలో అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. ఇక వారి పెళ్లికి సంబంధించిన విషయంపై కూడా ఇంతవరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. ఎవరు కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు కానీ ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయని ఫిబ్రవరి 6వ తేదీన జరగాల్సిన పెళ్లి ఏడవ తేదీన జరుగుతోంది అని కూడా ఒక టాక్ అయితే వస్తుంది.

భారీ ఖర్చుతో పెళ్లి

భారీ ఖర్చుతో పెళ్లి

రాజస్థాన్లోని అతి ప్రాముఖ్యత కలిగిన జైసేల్కలలోని సూరజ్ గాడ్ ప్యాలెస్ లో ఈ వేడుక ఘనంగా జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ లోని కొందరు ప్రముఖ స్టార్స్ కూడా ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా రెండు రోజులపాటు పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్ కొనసాగనున్నాయి. రాబోయే అతిధులను రిసీవ్ చేసుకునేందుకు 80 కార్లకు పైగా సిద్ధం చేశారట. ఈ పెళ్లి కోసమే దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మెగా హీరోకు స్పెషల్ ఇన్విటేషన్

మెగా హీరోకు స్పెషల్ ఇన్విటేషన్

ఇక కీయరా అద్వానీ పెళ్లికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు అనే విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక రాంచరణ్ తో అయితే కీయరాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇది వరకే వీరి కలయికలో వినయ విధేయ రామ అనే సినిమా వచ్చింది. అలాగే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న 15వ సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాంచరణ్ ను మాత్రం ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం.

మహేష్ బాబు కూడా..

మహేష్ బాబు కూడా..

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వీరి పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. కీయరా అద్వానీ తన మొదటి తెలుగు సినిమాను మహేష్ బాబు తో చేసిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్లో ఆమె తక్కువ రోజులే ఉన్నప్పటికీ మహేష్ బాబుతో మంచి స్నేహం ఏర్పడింది. దీంతో మహేష్ కు కూడా ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపినట్లు సమాచారం. మరి వీరు పెళ్లిలో పాల్గొన్న ఫొటోలు రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X