ప్రమాదం నుంచి తప్పించుకొన్న కియారా అద్వాని.. డేంజర్ జోన్‌లో మరో ముగ్గురు!
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనావైరస్ ఇంకా వణికిస్తూనే ఉంది. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో షూటింగులకు సిద్ధమైన జగ్ జగ్ జీయో చిత్ర యూనిట్‌ను కోవిడ్ 19 వెంటాడటంతో నటీనటులుందరూ వెనక్కి తిరిగి వచ్చారు. ఈ చిత్ర యూనిట్‌లో ప్రముఖ నటీనటులతోపాటు పలువురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో చండీగఢ్ నుంచి ముంబైకి తిరిగి వచ్చారు. అయితే ఈ విషయంలో కియారా అద్వాని, అనిల్ కపూర్ సేఫ్‌గా బయటపడ్డారు. ఈ షూటింగు వివరాల్లోకి వెళితే..

టీమ్‌లో ఎక్కువ మందికి కరోనా
బాలీవుడ్‌లో భారీ తారాగణంతో రూపొందుతున్న జగ్ జగ్ జీయో చిత్ర షూటింగ్ చండీగఢ్‌లో జరుగుతున్నది. ఈ చిత్ర షూటింగులో చాలా మందికి కరోనా లక్షణాలు కనిపించడంతో అందరికీ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. దాంతో పలువురికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో షూటింగు వాయిదా వేసి ముంబైకి తిరిగి వచ్చారు.

వరుణ్ ధావన్, నీతూ సింగ్‌కు పాజిటివ్
జగ్ జగ్ జియో చిత్రంలో అనిల్ కపూర్, కియారా అద్వాని, వరుణ్ ధావన్, నీతూ సింగూ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్‌కు పరీక్షలు జరిపించిన అనంతరం వరుణ్ ధావన్, నీతూ సింగ్, డైరెక్టర్ రాజ్ మెహతా, కరోనాపాజిటివ్ అని తేలింది. దాంతో టీమ్ అంతా తిరిగి వచ్చేశారు.

అనిల్ కపూర్‌పై రూమర్లు
తొలుత అనిల్ కపూర్‌కు కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలినట్టు వార్తలు వచ్చాయి. అయితే తనకు కరోనా పాజిటివ్ అని రాలేదు. కరోనా నెగిటివ్ అంటూ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దాంతో అనిల్ కపూర్‌పై వచ్చిన రూమర్లకు తెరపడింది. ముంబైకి చేరుకొన్న అనిల్ కపూర్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్టు సమాచారం.
Recommended Video

కియారా అద్వానికి కోవిడ్19 నెగిటివ్
ఇదిలా ఉండగా, జగ్ జగ్ జీయో కోసం చండీగఢ్ షూటింగులో పాల్గొన్న కియారా అద్వానీ కరోనావైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు నెగిటివ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకొన్నారు. ప్రస్తుతం ముంబైకి చేరుకొన్న కియారా ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











