Kiara Advani తో వెడ్డింగ్ తర్వాత సిద్దార్థ్ కోట్ల గిఫ్టులు.. గెస్టులకు 100 వంటకాలు.. అవేమిటంటే?
బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా వివాహం ఆడంబరంగా జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ నగరంలోని సూర్యగఢ్ ప్యాలెస్‌ను వీరి వివాహం కోసం అంగరంగవైభవంగా ముస్తాబు చేశారు. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న కియారా, సిద్దార్థ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. డిస్టినేషన్ వెడ్డింగ్‌గా జైసల్మేర్‌ను వేదికగా ఎంచుకొన్నారు. కియారా, సిద్దార్థ్ పెళ్లి వేడుక గురించిన వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 7వ తేదీన వైభవంగా
బాలీవుడ్ తార కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా వివాహం వాస్తవానికి ఫిబ్రవరి 6వ తేదీన జరగాల్సింది. కానీ ఒక రోజు వాయిదా వేసి ఫిబ్రవరి 7 తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి మెహందీ ఫంక్షన్, సోమవారం రాత్రి హల్దీ, సంగీత్ ఫంక్షన్లు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మెహందీ ఫంక్షన్‌ను కుటుంబ సభ్యులు జోష్‌గా నిర్వహించినట్టు సమాచారం.

అంబానీ కుటుంబంతో సహా..
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లికి అతిథులు రెండు రోజుల ముందుగానే జైసల్మేర్‌కు చేరుకొన్నారు. కియారా, సిద్దార్థ్ వెంట కరణ్ జోహర్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జుహీ చావ్లా, అంబానీ కుటుంబాలు అక్కడికి చేరుకొన్నాయి. కియారాకు అంబానీ కూతురు స్కూల్ మేట్ కావడంతో వారి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతిథులకు సకల వసతులతోపాటు భారీ ఏర్పాట్లు చేశారు.

అతిథులకు 100కుపైగా వంటకాలు
జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో విందు ఏర్పాట్లు భారీగా చేశారు. దాదాపు 100కుపైగా నోరూరుంచే వంటకాలను సిద్దం చేస్తున్నారు. ఇటాలియన్, చైనీస్, అమెరికన్, సౌత్ ఇండియన్, మెక్సికన్, రాజస్థానీ, పంజాబీ, గుజరాతీ డిషెస్‌ను సిద్దం చేశారు. జైసల్మేర్‌లోని గోత్వాన్ లడ్డూను ప్రత్యేకంగా వడ్డించనున్నారు.

ముంబైలో సముద్ర తీరంలో
జైసల్మేర్‌లో పెళ్లి తర్వాత ముంబైలోని సముద్రానికి అభిముఖంగా ఉన్న విలాసవంతమైన ఇంటిలోకి కియారా, సిద్దార్థ్ వెళ్లనున్నారు. పెళ్లికి ముందే ఈ ఇంటిని తమకు నచ్చిన విధంగా ఇంటీరియర్ డిజైన్ పనులు పూర్తి చేశారు. వివాహం అనంతరం కియారా, సిద్దూ ఇద్దరు ఈ ఇంటిలోనే ఉంటారని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

కియారాకు విలువైన, ఖరీదైన బహుమతులు
తన భార్యగా మారుతున్న ప్రియురాలికి కియారా అద్వానీకి పెళ్లి తర్వాత పెద్ద బహుమానం ఇవ్వడానికి సిద్దార్థ్ మల్హోత్రా రెడీ అయ్యారు. పెళ్లి తర్వాత విలాసవంతమైన కారును, ఖరీదైన నెక్లెస్‌ను గిఫ్టుగా ఇస్తారని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. కియారాకు సిద్దార్థ్ ఇచ్చే గిఫ్టు విలువ కనీసం 5 కోట్ల రూపాయల మేర ఉంటుందని చెప్పారు.


Click it and Unblock the Notifications











