ఆ మూవీలో నటించడం లేదని తేల్చి చెప్పిన కియారా!

బాలీవుడ్ నటి కియారా అద్వానీ త్వరలో ఇంతియాజ్ అలీ తెరకెక్కించబోయే 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్‌లో నటించబోతున్నట్లు మీడియా ఛానల్స్, పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆమె ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

'ఒక లీడింగ్ న్యూస్ పేపర్ వారు నేను ఇంతియాజ్ అలీ సర్ తీయబోయే తర్వాతి సినిమాలో చేస్తున్నట్లు రాశారు. ఆ వార్త నిజమైతే సంతోషమే. కానీ అది నిజం కాదు. నన్ను ఎవరూ ఆ ప్రాజెక్ట్ గురించి సంప్రదించలేదు' అని ట్వీట్ చేశారు.

కియారా అద్వానీ పేరు మాత్రమే కాదు... సారా అలీ ఖాన్ పేరు సైతం 'లవ్ ఆజ్ కల్ 2' విషయంలో ప్రచారంలో ఉంది. అయితే ఈ విషయంలో ఇంతియా అలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంతా ఫైనల్ అయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడించారు.

Kiara Advani tweet on Love Aaj Kal 2

కాగా... ప్రస్తుతం కియారా తన తాజా తెలుగు చిత్రం 'వినయ విధేయ రామ' ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చారు. రామ్ చరణ్ మూవీకి సంబంధించిన విశేషాలు పంచుకంటూ బిజీగా గడుపుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించి ఈ మూవీ జనవరి 11న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X