‘లస్ట్ స్టోరీస్’ బూతు సీన్... తల్లిదండ్రులతో కలిసి చూసిన కియారా అద్వానీ, ఎలా రియాక్ట్ అయ్యారంటే?
'భరత్ అనే నేను' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కియారా అద్వానీ 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్ సీన్లలో నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. సెక్స్ టాయ్స్ ఉపయోగించి స్వయంతృప్తి పొందే సీన్లతో పాటు, పడకగది శృంగార సీన్లలో ఎలాంటి మొహమాటం లేకుండా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా 'లస్ట్ స్టోరీస్' గురించిన ప్రస్తావన రాగా.... ఆసక్తిక విషయాలు చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులతో పాటు గ్రాండ్ మదర్ కూడా తాను నటించిన ఆ సీన్లు చూసినట్లు తెలిపారు. వారు ఎలా రియాక్ట్ అయ్యారో కూడా వెల్లడించారు.

మా ఫ్యామిలీ మద్దతు ఉంది
‘లస్ట్ స్టోరీస్'లో ఆ సీన్ చూసిన తర్వాత గ్రాండ్ మదర్ పూర్తి మద్దతు ఇచ్చారు. ఎందుకంటే అది కేవలం నటన మాత్రమే. నా తల్లిదండ్రులతో కలిసి చూశాను. అందరికీ నా నటన ఎంతో నచ్చింది. ఇదంతా నా ప్రొఫెషన్లో భాగం. ఆ విషయం వారికి కూడా తెలుసు' అని కియారా చెప్పుకొచ్చారు.

వారు ఎప్పుడూ ప్రభావితం కాలేదు
నేను నటించిన ఆర్గాజం(స్వయం తృప్తి) సీన్ చూసినపుడు మా పేరెంట్స్ ఏ మాత్రం ప్రభావితం కాలేదు. సినిమా కోసం నేను ఎలాంటి సీన్ చేయడానికైనా ఒప్పుకుంటానని వారికి ముందే తెలుసు. వారికి నేను ముందుగానే అన్ని విషయాలు చెప్పి ప్రిపేర్ చేస్తానని కియారా వెల్లడించారు.

మా గ్రాండ్ మదర్ తల తిప్పుకోకుండా చూస్తుంది
మా గ్రాండ్ మదర్ బ్రిటిష్. అందుకే ఆమెకు కొన్ని హిందీ జోక్స్ అర్థం కావు. సబ్ టైటిల్స్ చదువుతూ అర్థం చేసుకుంటుంది. ఎలాంటి సీన్లు అయినా ఏ మాత్రం మొహమాట పడకుండా స్ట్రైట్ ఫేస్ పెట్టి చూస్తుంది. ఇలాంటి విషయాల్లో నాకు మద్దతుగా ఉంటుంది. ఇది కేవలం నటన కాబట్టి స్పోర్టివ్‌గా తీసుకుటుందని కియారా తెలిపారు.

కియారా అద్వానీ
కియారా అద్వానీ సినిమాల విషయానికొస్తే... ఆమె నటించిన ‘కబీర్ సింగ్' విడుదలకు సిద్ధమవుతోంది.ఇందులో షాహిద్ కపూర్‌కు పోడీగా నటించారు. జూన్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి'కి ఇది రీమేక్. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సినిమాలో హైలెట్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











