Kiara Advani Wedding రాజరిక పద్దతుల్లో వైభవంగా వివాహం.. సూర్యాగఢ్ ప్యాలెస్‌లో ఒక్క రోజు రెంట్ ఎంతంటే?
బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా వివాహానికి భారీగా ఏర్పాట్లు జరిగాయి. రాజరిక సంప్రదాయాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ ఇద్దరి పెళ్లికి హంగులు ఏర్పాటు చేశారు. కియారా, సిద్దార్థ్ మ్యారేజ్ రాజస్థాన్‌లోని జైసల్మేర్ నగరంలోని సూర్యాగఢ్ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 7వ తేదీన జరుగుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రీటల పెళ్లికి సూర్యాగఢ్ ప్యాలెస్‌ను కళ్లు మిరిమిట్లు గొలిపే లైటింగ్‌తో అలకరించారు. కియారా, సిద్దార్థ్ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సంగీత్‌లో కాలా చష్మా పాటకు
కియారా అద్వానీ పెళ్లిలో భాగంగా సూర్యాగఢ్ ప్యాలెస్‌లో సంగీత్ కార్యక్రమాన్ని జోష్‌గా నిర్వహించారు. కాబోయే వధూవరులు తమ సినిమాలకు సంబంధించిన, అలాగే బాలీవుడ్ హిట్ సినిమా పాటలకు స్టెప్పులు వేశారు. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, షాహీద్ కపూర్, కాలా చష్మా పాటకు డ్యాన్సులు వేశారు. ఇక షాహీద్ కపూర్ డోలా రే డోలా పాటకు జోష్‌తో స్టెప్పులు వేసి ఆకట్టుకొన్నారు.

అందంగా ముస్తాబైన సూర్యాగఢ్ ప్యాలెస్
కియారా అద్వానీ, సిద్దార్థ్ పెళ్లి కోసం చారిత్రాత్మక సూర్యాగఢ్ ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు. వీరిద్దరి పెళ్లి ప్యాలెస్‌లోని బావ్డీ అనే ప్రదేశంలో నిర్వహిస్తారు. పెళ్లి అనంతరం వెంటనే రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రాజరిక సంప్రదాయ పద్దతులతో
రాజస్థాన్ సంప్రదాయం ప్రకారం హిందూ మతాచారం లోబడి.. రాయల్‌గా కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లిని డిజైన్ చేశారు. సంగీత్, రిసెప్షన్ కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా మలచడానికి భారీ డీజే ట్రక్కులను తీసుకొచ్చారు. అలాగే పెళ్లి ఊరేగింపు కోసం రాజస్థాన్‌లోని పాపులర్ బ్యాండ్‌ను తెప్పించారు. పూలతో అలంకరించిన రథాలను ఏర్పాటు చేశారు. వధూవరులను రథాలపైకి ఎక్కించి ఊరేగిస్తారు.

100 మందికిపైగా అతిథుల కోసం
కియారా, సిద్దార్థ్ తమ పెళ్లి కోసం 100 మంది అతిథులను ఆహ్వానించారు. సూర్యాగడ్ ప్యాలెస్‌లోని సెలబ్రేషన్ గార్డెన్, లేక్ గార్డెన్ వద్ద పెళ్లి కార్యక్రమాలను, విందు కోసం ఏర్పాటు చేశారు. చిన్నపాటి కొలను పక్కన.. ఆకాశం కింద.. ఆరు బయట చల్లని వాతావరణంలో అతిథులకు విందు ఏర్పాటు చేయడం గమనార్హం.

సూర్యాగఢ్ ప్యాలెస్‌లో రెంట్ ఎంతంటే?
చారిత్రాత్మక సూర్యాగఢ్ ప్యాలెస్‌లో బస చేయడం అత్యంత విలాసవంతంగా, ఖరీదైన వ్యవహరం. సాధారణ ప్రజలకు అందుబాటులో లేని విధంగా రూమ్ రెంట్ ఉంటుంది. సాధారణంగా తక్కువలో తక్కువగా ఒక్కో గది రెగ్యులర్ దినాల్లో 23 వేల రూపాయలు, హాలీడేస్, వీకెండ్స్‌లో 36 వేలు. ఇక విలాసవంతమైన జైసల్మేర్ హవేలిలో ఒక్కో గది కిరాయి రోజుకు 76 వేల రూపాయలు అని హోటల్ యాజమాన్యం వెల్లడించింది.


Click it and Unblock the Notifications











