తుపాకీతో మహేష్ హీరోయిన్ హల్ చల్.. షూటింగ్ స్పాట్‌లోనే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినీ తారలు మెల్లగా రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు ఇంటికే పతిమితమైన హిందీ సెలబ్రెటీలు చాలా రోజుల తరువాత లొకేషన్స్ లో దర్శనమిస్తున్నారు. ఇక అటు బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా చక్రం తిప్పుతున్న కీయరా అద్వానీ తన సినిమాలను స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటో వైరల్ గా మారింది.

చాలా రోజుల తరువాత..
కీయరా తెలుగులో భరత్ అనే నేను సినిమాతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ బ్యూటీకు తెలుగు జనాలు మహేష్ హీరోయిన్ అనే ఒక ట్యాగ్ తగిలించేశారు. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే సినిమా చేసింది గాని ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక చాలా రోజుల తరువాత కీయరా ఒక హిందీ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఇచ్చింది.

తుపాకి పట్టుకొని.. కన్నుతో కొట్టేసింది
వరుణ్ ధావన్ తో ఒక కామెడీ సినిమా చేస్తున్న కీయరా సెట్స్ లో ఒక గన్నుతో దర్శనమిచ్చింది. అది నిజమైన గన్ను కాదు లెండి. ఒక సీన్ కోసం తయారు చేసిన బొమ్మ తుపాకి పట్టుకొని కెమెరాకు ఇలా వ్పొజిచ్చింది. అలాగే కన్ను కూడా కొట్టిన కీయరా కుర్రాళ్ళ మనసుల్లో బలంగా ప్రేమ బులెట్ ని దింపినట్లు అర్ధమవుతోంది. రెడ్ జాకెట్ లో కనిపించిన కీయరా.. 'లెట్స్ షూట్.. వర్క్ మోడ్' లో ఉన్నాను అంటూ ఒక వివరణ కూడా ఇచ్చింది.

కీయరా, వరుణ్.. బాక్సాఫీస్ జోడి..
ఇక త్వరలో రాబోయే ఈ రొమాంటిక్-కామెడీ రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 24న చండీఘర్ లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ సెట్ చేయని ఈ ప్రాజెక్టులో నీతు కపూర్, అనిల్ కపూర్ కూడా నటించనున్నారు. ఈ మధ్య కాలంలో వరుణ్ ధావన్ తో పాటు కీయరా కూడా వరుస బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతోంది. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
Recommended Video

రెమ్యునరేషన్ ఇచ్చినా పరవాలేదు..
కీయరా అద్వానీ తెలుగులో రెండు సినిమాలు చేసిన తరువాత మరోక సినిమాను ఇంకా ఓకే చేయలేదు. అందుకు కారణం ఆమె వద్దకు సరైన కథలు రావడం లేదట. ఆ మధ్య కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఎందుకో ఒప్పుకోలేదట. రెమ్యునరేషన్ తక్కువ ఆఫర్ చేశారనే రూమర్స్ వైరల్ అవ్వగా అవన్నీ అబద్దాలని కీయరా కొట్టి పారేసింది. అలాగే కథలో పాత్ర నచ్చితే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా పరవాలేదని కూడా ఈ బ్యూటీ చాలా క్లారిటీగా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











