ప్రభాస్ ‘ఆదిపురుష్’లో కిచ్చా సుదీప్: అదిరిపోయే పాత్రకు కన్నడ స్టార్ గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ద్వారా అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. అయితే, ఈ మధ్య కరోనా ప్రభావం ఎక్కువగా పెరగడంతో దాన్ని నిలిపివేశారు. అంతా సర్ధుకున్న తర్వాత చిత్రీకరణను పున: ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

రామాయణంలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో 'ఆదిపురుష్' రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. టాలీ బ్యూటీ కృతి సనన్ సీతగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడని తెలిసింది. రావణుడి సోదరుడు విభీషణుడి పాత్రలోనే అతడు కనిపించబోతున్నాడని సమాచారం. కొద్ది సేపే ఉన్నా ఈ రోల్ ఎంతో హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.

Kiccha Sudeep Green Signal to a Perfect Role in Adipurush

మంచి మీద చెడు గెలవడం అనే కాన్సెప్టుతో వస్తున్న 'ఆదిపురుష్'.. 3డీ టెక్నాలజీతో రూపొందుతోంది. అందుకే వీఎఫ్ఎక్స్ కోసం దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ శ్రీరామనవమికి మూవీ నుంచి పోస్టర్ విడుదల చేయాలని భావించినా.. కరోనా ప్రభావం కారణంగా అది వీలు పడలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఇక, ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది ద్వితియార్ధంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X