twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్‌పై, ఆమె తండ్రిపై కమెడియన్ సెటైర్లు.. మనస్తాపంతో!

    |

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోమారు వార్తల్లో నిలిచింది. వరుణ్ ధావన్, అలియా భట్, సోనాక్షి సిన్హా కీలక పాత్రల్లో నటించిన కళంక్ చిత్రం ఏప్రిల్ 17న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి ప్రచారం కల్పించేందుకు అలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి ఇటీవల పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ షోకు ప్రముఖ కమెడియన్ కికు శ్రద్దా కూడా హాజరయ్యారు. కళంక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కళంక్ చిత్రానికి అభిషేక్ వెర్మన్ దర్శకుడు. కపిల్ శర్మ షోలో కికు శ్రద్దా అలియా భట్ ని మనస్తాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది.

    కపిల్ శర్మ షో

    కపిల్ శర్మ షో

    కపిల్ శర్మ షో అంటేనే జోకులతో ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. కానీ కికు శార్ధ మాటిమాటికి అలియా భట్ పై సెటైర్లు వేస్తుండడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కికు శార్ధ, వరుణ్ ధావన్ ఇద్దరూ కలసి అలియా భట్ పై జోకులతో అతిచేసినట్లు తెలుస్తోంది. షో ముగుసిన తర్వాత అలియా భట్ వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

    చెత్త జోకులు

    చెత్త జోకులు

    కికు శార్ధ వేసిన చాలా జోకులకు అలియా చాలా ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది. కికు శార్ధ షోకు హాజరైన ఆడియన్స్ ని ఉద్దేశిస్తూ.. మీకు స్కూటర్ ఎలా స్టార్ట్ అవుతుంతో తెలుసా అని అడిగి ఆ తర్వాత.. భట్..భట్.. భట్ అంటూ విచిత్రమైన సౌండ్ చేస్తూ అలియని ఆటపట్టించాడు. కికు శార్ధ మరో సెటైర్ ని అలియా భట్ తండ్రి మహేష్ భట్ పై వేసినట్లు తెలుస్తోంది.

    మీ తండ్రి ఆ బిజినెస్ చేస్తున్నాడా

    మీ తండ్రి ఆ బిజినెస్ చేస్తున్నాడా

    కికు శార్ధ అలియా భట్ ని ప్రశ్నిస్తూ.. మీ తండ్రి మహేష్ భట్ నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారం ఏదైనా చేస్తున్నారా అని అడిగాడు. దీనికి అలియా అలాంటిదేమి లేదు అని సమాధానం ఇచ్చింది. అయితే ఆయన ఫుట్ పాత్, సడక్ లాంటి చిత్రాలు ఎందుకు చేశారు అంటూ జోకులు వేశాడు. తన తండ్రిని అవమానకరంగా మాట్లాడడంతో అలియా భట్ కోపం మరింతగా ఎక్కువైనట్లు తెలుస్తోంది.

    భారీ చిత్రాలు

    భారీ చిత్రాలు

    ఇక సినిమాల విషయానికి వస్తే అలియా భట్ పేరు మీద ప్రస్తుతం వందల కోట్ల సినిమా బిజినెస్ జరుగుతోంది. కళంక్ చిత్రంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో అలియా భట్ నటిస్తోంది. అలియా భట్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్.రాజమౌళి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రంలో అలియా రాంచరణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది.

    English summary
    The Kapil Sharma Show: Kiku Sharda goes overboard, upsets Alia Bhatt with his jokes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X