ఓ కప్పు కాఫీ, చాయ్‌కి 78 వేలు బిల్లు.. టాప్ కమెడియన్ ఎలా రియాక్టయ్యాడంటే..
హిందీ టెలివిజన్ రంగంలో స్టార్ కమెడియన్ కుకు శార్ధాకు గమ్మత్తైన పరిస్థితి ఎదురైంది. ఓ కప్పు కాఫీ, టీ తాగినందుకు 78 వేల రూపాయల హోటల్ బిల్లు చూసి షాకయ్యాడు. కానీ అంతలోనే తేరుకుని హ్యాపీగా బిల్లు చెల్లించాడు. అయితే ఆ బిల్లు కట్టే విషయంలో ఎలాంటి తడబాటు లేకుండా చెల్లించడం కాస్త వినోదం కూడా జోడైంది. ఆ బిల్లు వెనుక అసలు విషయం ఏమిటంటే..

ఇండోనేషియాలో కికు శార్దా
హిందీ టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో ది కపిల్ శర్మ షో గురించి తెలిస్తే కికు శార్ధ క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. బంపర్, పలక్, బచ్చా యాదవ్ లాంటి పాత్రలతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులు. నటనలోనూ, కామెడీ పండించడంలోను దిట్ట. తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త తప్పుకొని ఇండోనేషియాలోని బాలీలో విహార యాత్ర చేస్తున్నాడు. ఆ సందర్భంగా ఎదురైన సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నాడు.
కప్పు కాఫీ, టీకి 78 వేలు
ఇండోనేషియాలోని బాలీలో నేను పర్యటిస్తున్నాను. నేను తాగిన ఒక కప్పుషినో కాఫీ, ఓ కప్పు టీకి హోటల్ రూ.78,650/- బిల్లు వేశారు. అయినా నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు. ఎందుకుంటే ఇండోనేషియా కరెన్సీ భారత్‌లోకి మార్పిడి చేస్తే కేవలం రూ.400 మాత్రమే. అందుకే నేను లైట్ తీసుకొన్నాను. అయితే రెండు కప్పుల కాఫీ, టీకి కాస్త ధర ఎక్కువే అంటూ చివర్లో చమత్కరించాడు.

యాక్టర్ రాహుల్ బోస్‌కు ఇలానే
కమెడియన్ కికు సోషల్ మీడియాలో పెట్టిన బిల్లు చూడగానే ఇటీవల నటుడు రాహుల్ బోస్‌కు ఎదురైన చేదు అనుభవం అందరికీ గుర్తు వచ్చింది. చండీగఢ్‌లోని ఓ హోటల్‌లో రెండు అరటి పళ్లకు యాజమాన్యం రూ.442 రూపాయలు బిల్లు వేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఈ సంఘటన వైరల్ అయిన విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో బిజీగా
కమెడియన్ కికు శర్దా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. టెలివిజన్ రంగంలో పలు రకాల కార్యక్రమాలు చేస్తూనే బాలీవుడ్‌లో కూడా మంచి ఆఫర్లు దక్కించుకొంటున్నాడు. యాంగ్రీ బర్డ్స్ అనే యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ కూడా చెప్పాడు. అలాగే బూ సబ్కూ పెటేగి అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











