ముంబై వీధుల్లో అర్థరాత్రి వేళ హీరోయిన్ షికార్లు.. ఆటోలో అలా కనిపించడంతో!
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి కిమ్ శర్మ. ఖడ్గం సినిమాలో ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద నటుడు కుర్రాకారును హోరెత్తించిన ఈ భామ.. ఆ తర్వాత రామ్ చరణ్ 'మగధీర' సినిమాలో కనిపించింది. ఇక ఆ నాటి నుంచీ అడ్రెస్స్ లేని ఈ హాట్ భామ ముంబై వీధుల్లో అర్థరాత్రి వేళ షికార్లు చేస్తూ దర్శనమిచ్చి షాకిచ్చింది.
ఇటీవల ముండై లోని బాంద్రా వీధుల్లో నడి రాత్రి ఆటోలో షికారు చేసింది కిమ్ శర్మ. ఆ టైమ్ లో ఈమె ఎందుకోసం ఆటో ఎక్కిందో తెలియదు గానీ.. జర్నలిస్టుల కెమెరాలకు చిక్కడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ రాత్రి కిమ్ శర్మకు ఆటోలో ఏం పని? ఆమె ఎక్కడికి పోతోంది? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి బీ టౌన్ జనాల్లో. అయితే కిమ్ శర్మ అర్థరాత్రి ఒక్కతే ఇలా షికార్లు కొట్టడం వెనుక ఎలాంటి సందేహించాల్సిన అంశాలు లేవని పేర్కొన్నాయి మీడియా సంస్థలు. చేతిలో సినిమాలు లేవు కాబట్టి కేవలం తనను తాను డిఫెరెంట్ గా ప్రమోట్ చేసుకోవడానికే ఇలా ఆటో ఎక్కిందని వార్తలు వస్తున్నాయి.

ఇక కిమ్ శర్మ వ్యక్తిగత విషయాలకొస్తే.. అమ్మడు సినిమాలతో పాటు డేటింగ్స్, పార్టీలు అన్నింటా ముందే. గతంలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తో స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేసిన ఈ భామ.. ఇటీవల ఆయన రిటైర్మెంట్ తర్వాత పార్టీలో తెగ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్న కిమ్ శర్మ.. ఇటీవలే తన భర్తకి విడాకులిచ్చి కొంతకాలం వరకు హీరో హర్షవర్ధన్ రాణేతో డేటింగ్ చేసింది. కాగా అమ్మడికి ఈ రిలేషన్‌షిప్ బ్రేకప్ అయిందనేది తాజా సమాచారం.


Click it and Unblock the Notifications











