twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువరాజ్ రిటైర్మెంట్: మరువలేనంటూ మాజీ ప్రేయసి సందేశం

    |

    భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా యువరాజ్ సింగ్ ప్రస్థానం చెప్పుకోదగినది. ఎన్నో రికార్డులను తిరగరాస్తూ మరెన్నో విజయాలను భారత క్రికెట్ జట్టు ఖాతాకు చేర్చడంలో యువీ పాత్ర ఎంతో కీలకమైంది. అన్ని ఫార్మాట్స్ లో బ్యాట్స్‌మన్ గా, బౌలర్ గా అంతకు మించి ఫీల్డర్ గా అద్భుతాలు సృష్టించిన యువరాజ్ సింగ్.. నిన్న (జూన్10) క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. ఇక ఏ ఫార్మాట్ లోనూ తాను ఆడనని ఈ సందర్బంగా ఆయన ప్రకటించారు.

    2000 సంవత్సరంలో కెన్యాతో భారత్ తలపడిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రంగ ప్రవేశం చేసిన యువీ చివరగా 2017 లో వెస్టిండీస్‌తో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌ల్లో(2007 టీ20, 2011 వన్డే) యువరాజ్ కీలక పాత్ర పోషించాడు.

    Kim Sharma Tweeted On Yuvraj Singhs Retirement

    2011 వన్డే ప్రపంచకప్‌లో బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి టీమిండియా కప్పు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక క్రికెట్ ఆట సంగతి అటుంచితే బాలీవుడ్ భామలతో డేటింగ్స్, షికార్లు అన్నింటిలోనూ యువీ ఫేమస్ పర్సనే. దాదాపు ఏడుగురు బాలీవుడ్ హీరోయిన్స్ తో ఆయన చెట్టాపట్టాలేసుకు తిరిగాడనే రూమర్స్ ఉన్నాయి. ఆ లిస్టులో ఒకరే కిమ్ శర్మ. ఈ బాలీవుడ్ బ్యూటీతో ఒకప్పుడు యువీ ప్రేమ మత్తులో మునిగితేలారు. ఆ తర్వాత వీరి రిలేషన్ షిప్ బ్రేకప్ అయింది.

    అయితే యువరాజ్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సందర్బంగా ఆసక్తికరంగా స్పందిస్తూ ట్వీట్ పెట్టింది కిమ్ శర్మ. ''యూవీ ఇన్నాళ్లు అద్భుతంగా ఆడావు.. నీ ఆట, రికార్డులు ఏ నాటికీ మరువలేనివి. హేజల్ కీచ్ (యువీ భార్య)తో నీ మిగతా జీవితం కూడా ఇలానే విజయవంతం కావాలని కోరుకుంటున్నాను'' అని ఆ ట్వీట్ లో పేర్కొంది కిమ్. యూవీ భార్య హేజల్ కీచ్ స్పందిస్తూ 'నీ భార్య అయినందుకు గర్వపడుతున్నా' అని సిసిల మీడియా సందేశం పాస్ చేసింది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులు యువీ కెరీర్, కీలక ఘట్టాల గురించిన చర్చల్లో మునిగి తేలుతున్నారు.

    English summary
    Bollywood beauty Kim Sharma latest tweet on indian criketer Yuvraj Singh Retirement. She said that not to forgot Yuvaraj Performence
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X