Yentamma Song: సల్మాన్, వెంకీమామతో రామ్ చరణ్ అదిరే స్టెప్పులు.. ఇచ్చి పడేశారుగా..
బాలీవుడ్ భాయ్ గా అందరూ ముద్దుగా పిలుచుకునే సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమాతో హై రేంజ్ లో సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. సల్మాన్ మేయిన్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కిసీ కా భాయ్ కిసికి జాన్.
ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు అందుకోవాలి అని సల్మాన్ ఖాన్ ఎక్కువగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే బతుకమ్మ సాంగ్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో పాటను విడుదల చేసారు. ఆ పాటలో రామ్ చరణ్ కూడా మెరిశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలంగాణ బ్యాక్ డ్రాప్
కిసీ కా భాయ్ కిసికి జాన్ సినిమాలో హీరోయిన్ నటిస్తున్న పూజ హెగ్డే వెంకటేష్ కి చెల్లెలి పాత్రలో కనిపిస్తుండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా వెంకటేష్ కుటుంబం కనిపించనుంది. తప్పకుండా ఈ బాలీవుడ్ సినిమా తెలుగు జనాలను కూడా గట్టిగానే ఎట్రాక్ట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాతో వెంకటేష్ కూడా బాలీవుడ్ లో హైలెట్ అవ్వాలని అనుకుంటున్నాడు.

బతుకమ్మ పాట
తెలంగాణ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం బతుకమ్మకు సంబంధించిన ఒక పాట విడుదల చేయగా ఆ బతుకమ్మ పాట అందరిని కాదు తెలంగాణ సంస్కృతి భారతదేశం మొత్తం చాటి చెప్పినట్లు అయిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈరోజు కొద్దిసేపటి క్రితం మరో సాంగ్ ఈ సినిమా నుంచి రిలీజ్ అయింది.

ఇప్పుడు.. ఏంటమ్మా సాంగ్
ఏంటమ్మా అంటూ సాగుతున్న ఈ సాంగ్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది. అదేమిటంటే ఈ సాంగ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కనిపించారు. ఈ విషయాన్ని పాట చూసిన వారందరూ ఇట్టే కనిపెట్టేయగా రాంచరణ్ కూడా తన సోషల్ మీడియాలో వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.

రామ్ చరణ్ స్పెషల్ మూమెంట్
ఇది తన ఆన్ స్క్రీన్ మూమెంట్స్ లో చాలా ముఖ్యమైనది అంటూ ఆయన పేర్కొన్నారు. విక్టరీ వెంకటేష్, సల్మాన్ ఖాన్ వంటి ఇద్దరు లెజెండ్స్ తో ఏంటమ్మా అనే సాంగ్ కి డాన్స్ చేయడం తన అదృష్టమని ఆయన కామెంట్ చేయగా అభిమానులు ఈ విషయం మీద వరుస కామెంట్లు చేస్తున్నారు. ఇక నిమిషాల్లోనే ఈ పోస్ట్ కూడా వైరల్ అయ్యింది.
రీమేక్ అంటూ..?
విశాల్ దాడ్లాని, పాయల్ దేవ్ పాడిన ఈ పాటను పాయల్ దేవ్ స్వరపరిచారు. ఇక ఈ సినిమాని సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ జీ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తోంది. ఫర్హాద్ సమ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని కాటమరాయుడు ఒరిజినల్ తమిళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఏంటమ్మా సాంగ్ లో హీరోలు వేసిన స్టెప్పులపై బజ్ మొదలయ్యింది. అయితే సాంగ్ మొత్తానికి రామ్ చరణ్ హైలైట్ గా నిలిచారని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











