టీమిండియా క్రికెటర్‌తో యంగ్ హీరోయిన్‌ డేటింగ్.. పక్కా ప్రూఫ్స్ ఇవే! వెరీ హాట్ ఇష్యూ

రంగుల ప్రపంచంలో హీరోహీరోయిన్ల మధ్య డేటింగ్ వ్యవహారాలు కామన్ అయిపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ భామలైతే మరింత ముందడుగేస్తూ రొమాంటిక్ జర్నీ చేస్తున్నారు. ఈ బాటలోనే వెళ్తున్న బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి ఏకంగా టీమిండియా క్రికెటర్‌తో డేటింగ్ చేస్తోందట. ప్రస్తుతం ఈ ఇష్యూ బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. పైగా తాజాగా ఓ ప్రూఫ్ కూడా చూపిస్తూ వీళ్లిద్దరి వ్యవహారం మరింత ముదిరింది అంటున్నారు జనం.

పార్టీలు, పబ్బులు.. క్రికెటర్‌తో బాలీవుడ్ బ్యూటీ

పార్టీలు, పబ్బులు.. క్రికెటర్‌తో బాలీవుడ్ బ్యూటీ

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగుతున్నారని, పార్టీలు, పబ్బులు అంటూ వీళ్ళ వ్యవహారం మరింత ముదిరిందని టాక్ నడుస్తూనే ఉంది.

అప్పుడు మొదలై మరింత ముదిరింది

అప్పుడు మొదలై మరింత ముదిరింది

క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి మధ్య ప్రేమ వ్యవహారం ఫిబ్రవరి నెలలో మొదలైందని అంటున్నారు. అప్పటి నుంచే ఈ ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారని, ఏ పార్టీ జరిగినా ఈ ఇద్దరి హంగామానే ఎక్కువగా కనిపిస్తోందని టాక్. ఇక ఈ మధ్యకాలంలో అయితే వీళ్ళ డేటింగ్ సంగతులు మరింత హాట్ టాపిక్ అవుతున్నాయి.

కేఎల్ రాహుల్ సందేశం.. అతియా శెట్టి రియాక్షన్

కేఎల్ రాహుల్ సందేశం.. అతియా శెట్టి రియాక్షన్

సరిగ్గా ఇలాంటి తరుణంలో అతియా శెట్టి పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ ఓ సందేశం పోస్ట్ చేశాడు. ఇందులో హాపీ బర్త్ డే అని పేర్కొంటూ కోతి ఎమోజీని జత చేశాడు రాహుల్. దీనిపై రియాక్ట్ అయిన అతియా శెట్టి.. దానికి రీ షేర్ చేస్తూ లవ్ గుర్తు ఎమోజీలను పోస్ట్ చేసింది.

పక్కా ప్రూఫ్స్ దొరికాయి.. ఇంకేముంది

పక్కా ప్రూఫ్స్ దొరికాయి.. ఇంకేముంది

దీంతో ఇన్నాళ్లుగా కేఎల్ రాహుల్- అతియా శెట్టి మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న రూమర్స్ నిజం చేసేశారు నెటిజన్లు. వీళ్లిద్దరి మధ్య డేటింగ్ నడుస్తోంది కాబట్టే.. ఇంతలా ఇద్దరూ రియాక్ట్ అయ్యారని అంటున్నారు. ఎలాగూ బయట బాగానే తిరుగుతున్నారు, ఇప్పుడు సోషల్ మీడియా హింట్ కూడా ఇచ్చేశారు. ఇంతకన్నా పక్కా ప్రూఫ్స్ కావాలా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

యంగ్ హీరోయిన్లతో ఇతనికి కొత్త కాదు

యంగ్ హీరోయిన్లతో ఇతనికి కొత్త కాదు

యంగ్ హీరోయిన్లతో క్రికెటర్ కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌, సోనాల్‌ చౌహాన్‌, ఆకాంక్ష రంజన్‌తో ఆయన ప్రేమలో ఉన్నాడంటూ పలు వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X