నటి పేరిట అడల్డ్ వీడియోలు.. నెట్టింట్లో వైరల్.. పోలీసులకు ఫిర్యాదు
ప్రస్తుతం మనమంతా డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. ఇక్కడ నిజం ఎంత ఉంటుందో అబద్దం కూడా అంతే ఉంటుంది. ఫేక్ అకౌంట్స్, ఫేక్ న్యూస్, ఫేక్ ఐడీలు, ఫేక్ మనుషులు ఇలా ప్రతీది ఓ ఫేక్. ఈ ఫేక్ వల్ల సెలెబ్రిటీలకు నిత్యం తలనొప్పలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సెలెబ్రిటీల పేర్ల మీద సోషల్ మీడియాలో ఖాతాలు నడిపిస్తూ పరువు తీస్తుంటారు. తాజాగా ఓ నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

ఫేక్ ఖాతాలతో..
బాలీవుడ్ నటి కొయినా మిత్ర పేరిట సోషల్ మీడియాలో ఫేక్ ఖాతాలు ఉన్నాయట. అందులోని కంటెంట్ చూసి ఆమె షాక్‌కు గురైందంటా. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. అడల్ట్ కంటెంట్, అసభ్యకర వీడియోలు తన పేరు మీద షేర్ చేస్తున్నారని ఫైర్ అయింది.

అడల్డ్ వీడియోలు..
తన పేరు మీద ఖాతాను ప్రారంభించి అడల్డ్ వీడియోలను షేర్ చేయడంపై కొయినా స్పందించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా పంపింది. అందులో ఒకదాంట్లో ఓ ఖాతాకు దాదాపు ముప్పై వేలకు ఫైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఫ్యాన్స్ క్లబ్ కాదు..
అయితే ఇది కొంచెం పద్దతిగానే ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేయగా.. అయినా అది తప్పేనని కొయినా వాదించింది. తన పేరు మీద ఇలా చేయడానికి వారెవ్వరని ప్రశ్నించింది. కనీసం అది ఫ్యాన్స్ క్లబ్, ఫ్యాన్ పేజ్ వంటివి కూడా కాదని పేర్కొంది.
Recommended Video

ఇన్‌స్టాగ్రామ్ ఎన్నడూ చెక్ చేయదు..
ఇన్‌స్టాగ్రామ్ ఎన్నడూ ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని చెక్ చేయదని ఫైర్ అయింది. అతనికి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ ఖాతాను డిలీట్ చేయలేదని అందుకే ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. అతడ్ని శిక్షించాలని, తన పేరుగా ఎవరినైనా మోసం చేశాడా? అన్న విషయాన్ని తెలుసుకోవాలని పోలీసులను కోరింది.


Click it and Unblock the Notifications











