Koffee With Karan 7: ఫ్లైట్‌లో శృంగారం చేసేందుకు ప్రయత్నించా.. ఆ హీరో భార్య చాలా టాలెంటెడ్
దర్శక నిర్మాతగా, హోస్ట్‌గా సక్సెస్ఫుల్ అయ్యాడు కరణ్ జోహార్. ఇక ఇతను వ్యాఖ్యతగా వ్యవహరించే కాఫీ విత్ కరణ్ టాక్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఈ షోలో సెలబ్రిటీలను తన పిలిచి వారిపై ప్రశ్నలు కురిపిస్తాడు. తిరకాసు క్వశ్చన్స్ వేసి వివిధ రకాలుగా రోస్ట్ చేస్తాడు. అది ఎలాంటి ప్రశ్న అయిన నిర్మొహమాటంగా అడిగేస్తాడు. తను కూడా అలాంటి సమాధానాలే చెబుతాడు. అయితే తాజాగా ఇలానే ఫ్లైట్‌లో శృంగారం గురించి చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్.

సెలబ్రిటీలను రోస్ట్ చేస్తూ..
కరణ్ జోహార్.. ప్రస్తుతం ఇతని గురించి తెలియని వారు ఎవరుండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వాటిని ఆయనే సొంతగా నిర్మించారు. అలాగే కాఫీ విత్ కరణ్ అనే టాక్ షోను ఇంట్రడ్యూస్ చేసి ఎంతో సక్సెస్ అయ్యారు. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్ ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ విజయవంతంగా సాగుతోంది. ఇక ఈ సీజన్లో సెలబ్రిటీలను పిలిచి మరి రోస్ట్ చేస్తున్నాడు కరణ్.

శృంగారం గురించి..
ఇప్పటికే ఈ షోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, సమంత, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ తదితరులు పాల్గొని సందడి చేశారు. వారి లైంగిక జీవితం, పర్సనల్ విషయాలు అడిగి, విచిత్రమైన సమాధానాలు రాబడుతూ షోను ఆసక్తికరంగా కంటిన్యూ చేస్తున్నాడు కరణ్ జోహార్. అయితే తాజాగా ఈ షోలో విమానంలో శృంగారం గురించి చెబుతూ ఆశ్చర్యపరిచాడు ఈ నిర్మాత.

విచిత్రంగా ఏం లేదు..
కాఫీ విత్ కరణ్ టాక్ షో తాజా ఎపిసోడ్లో బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి సనన్ పాల్గొని సందడి చేశారు. రాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా ''మీరు ఆ పని (శృంగారం) చేసిన విచిత్రమైన చోటు ఏది?'' అని టైగర్‌ను కరణ్ జోహార్ ప్రశ్నిస్తాడు. దీనికి ''నిజానికి అది విచిత్రంగా ఏం లేదు కానీ, కొంచెం అడ్వెంచరస్‌గా ఉంది'' అని టైగర్ ష్రాఫ్ బదులిస్తాడు.

ఒకసారి దొరికిపోయేవాన్ని..
ఈ ఆన్సర్ విన్న కరణ్.. ''హో.. మీరు మైల్ హై క్లబ్ మెంబర్ కదా.. అసలు ఆ చోటులో అది (శృంగారం) ఎలా చేస్తారో నాకు అస్సలు అర్థం కాదు. ఇదంతా మనం షో అయ్యాక మాట్లాడుకుందాం. నేను కూడా ఓసారి ట్రై చేశాను. కానీ ఫ్లైట్‌లో లూ (బాత్రూం) చాలా చిన్నగా ఉంటుంది. అంత సౌకర్యంగా అనిపించదు కదా. నిజానికి అప్పుడు నేను దొరికిపోయేంత పని అయింది. నా లక్ బాగుండి బయటపడ్డా'' అని కరణ్ చెప్పుకొచ్చాడు.

అతని భార్య టాలెంటెడ్..
తర్వాత ''మీరు రణ్వీర్ సింగ్‌ను చూసి అసూయపడే విషయం ఏమైనా ఉందా?'' అని అడగ్గా.. ''అతని భార్య (దీపికా పదుకొణె). ఆమె చాలా టాలెంటెడ్'' అని టైగర్ సమాధానమిస్తాడు. దీనికి కరణ్ జోహార్ బిగ్గరగా నవ్వుతూ.. ''చాలా టాలెంటెడ్ అందుకేనా?'' అని తిరిగి ప్రశ్నించగా.. ''ఆమె చాలా అందంగా ఉంటుంది'' అని టైగర్ రిప్లై ఇస్తాడు. ఇలాంటి తదితర ఆసక్తికర ప్రశ్నలతో అంతే ఆసక్తికర సమాధానాలతో ఎపిసోడ్ సాగింది.
పాన్ ఇండియాగా..
ఇక ఇదిలా ఉంటే కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్రం. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా సెప్టెంబర్ 9న గ్రాండ్‌గా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











