For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Koffee With Karan 7: ఫ్లైట్​లో శృంగారం చేసేందుకు ప్రయత్నించా.. ఆ హీరో భార్య చాలా టాలెంటెడ్​

  |

  దర్శక నిర్మాతగా, హోస్ట్​గా సక్సెస్​ఫుల్​ అయ్యాడు కరణ్​ జోహార్. ఇక ఇతను వ్యాఖ్యతగా వ్యవహరించే కాఫీ విత్ కరణ్​ టాక్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఈ షోలో సెలబ్రిటీలను తన పిలిచి వారిపై ప్రశ్నలు కురిపిస్తాడు. తిరకాసు క్వశ్చన్స్ వేసి వివిధ రకాలుగా రోస్ట్​ చేస్తాడు. అది ఎలాంటి ప్రశ్న అయిన నిర్మొహమాటంగా అడిగేస్తాడు. తను కూడా అలాంటి సమాధానాలే చెబుతాడు. అయితే తాజాగా ఇలానే ఫ్లైట్​లో శృంగారం గురించి చెప్పుకొచ్చాడు కరణ్​ జోహార్​.

  సెలబ్రిటీలను రోస్ట్ చేస్తూ..

  సెలబ్రిటీలను రోస్ట్ చేస్తూ..

  కరణ్​ జోహార్​.. ప్రస్తుతం ఇతని గురించి తెలియని వారు ఎవరుండరు. ఎన్నో సూపర్​ హిట్​ సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వాటిని ఆయనే సొంతగా నిర్మించారు. అలాగే కాఫీ విత్​ కరణ్​ అనే టాక్​ షోను ఇంట్రడ్యూస్​ చేసి ఎంతో సక్సెస్​ అయ్యారు. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్ ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్​ విజయవంతంగా సాగుతోంది. ఇక ఈ సీజన్​లో సెలబ్రిటీలను పిలిచి మరి రోస్ట్​ చేస్తున్నాడు కరణ్​.

  శృంగారం గురించి..

  శృంగారం గురించి..

  ఇప్పటికే ఈ షోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, సమంత, అక్షయ్​ కుమార్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ తదితరులు పాల్గొని సందడి చేశారు. వారి లైంగిక జీవితం, పర్సనల్ విషయాలు అడిగి, విచిత్రమైన సమాధానాలు రాబడుతూ షోను ఆసక్తికరంగా కంటిన్యూ చేస్తున్నాడు కరణ్ జోహార్. అయితే తాజాగా ఈ షోలో విమానంలో శృంగారం గురించి చెబుతూ ఆశ్చర్యపరిచాడు ఈ నిర్మాత.

  విచిత్రంగా ఏం లేదు..

  విచిత్రంగా ఏం లేదు..

  కాఫీ విత్ కరణ్​ టాక్ షో తాజా ఎపిసోడ్​లో బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ అండ్ బ్యూటీఫుల్​ హీరోయిన్ కృతి సనన్​ పాల్గొని సందడి చేశారు. రాపిడ్ ఫైర్​ రౌండ్​లో భాగంగా ''మీరు ఆ పని (శృంగారం) చేసిన విచిత్రమైన చోటు ఏది?'' అని టైగర్​ను కరణ్​ జోహార్ ప్రశ్నిస్తాడు. దీనికి ''నిజానికి అది విచిత్రంగా ఏం లేదు కానీ, కొంచెం అడ్వెంచరస్​గా ఉంది'' అని టైగర్ ష్రాఫ్​ బదులిస్తాడు.

   ఒకసారి దొరికిపోయేవాన్ని..

  ఒకసారి దొరికిపోయేవాన్ని..


  ఈ ఆన్సర్ విన్న కరణ్​.. ''హో.. మీరు మైల్​ హై క్లబ్​ మెంబర్​ కదా.. అసలు ఆ చోటులో అది (శృంగారం) ఎలా చేస్తారో నాకు అస్సలు అర్థం కాదు. ఇదంతా మనం షో అయ్యాక మాట్లాడుకుందాం. నేను కూడా ఓసారి ట్రై చేశాను. కానీ ఫ్లైట్​లో లూ (బాత్రూం) చాలా చిన్నగా ఉంటుంది. అంత సౌకర్యంగా అనిపించదు కదా. నిజానికి అప్పుడు నేను దొరికిపోయేంత పని అయింది. నా లక్​ బాగుండి బయటపడ్డా'' అని కరణ్ చెప్పుకొచ్చాడు.

  అతని భార్య టాలెంటెడ్​..

  అతని భార్య టాలెంటెడ్​..

  తర్వాత ''మీరు రణ్​వీర్ సింగ్​ను చూసి అసూయపడే విషయం ఏమైనా ఉందా?'' అని అడగ్గా.. ''అతని భార్య (దీపికా పదుకొణె). ఆమె చాలా టాలెంటెడ్​'' అని టైగర్ సమాధానమిస్తాడు. దీనికి కరణ్​ జోహార్ బిగ్గరగా నవ్వుతూ.. ''చాలా టాలెంటెడ్ అందుకేనా?'' అని తిరిగి ప్రశ్నించగా.. ''ఆమె చాలా అందంగా ఉంటుంది'' అని టైగర్​ రిప్లై ఇస్తాడు. ఇలాంటి తదితర ఆసక్తికర ప్రశ్నలతో అంతే ఆసక్తికర సమాధానాలతో ఎపిసోడ్​ సాగింది.

  పాన్ ఇండియాగా..

  ఇక ఇదిలా ఉంటే కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్రం. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్​ను సెప్టెంబర్​ 2న ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్​కు యంగ్ టైగర్​ జూనియర్ ఎన్టీఆర్​ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. రణ్​బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియాగా సెప్టెంబర్​ 9న గ్రాండ్​గా విడుదల కానుంది.

  English summary
  Producer Karan Johar Reveals He Tried To Make Out In Flight In Koffee With Karan Show Season 7.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X