తనతో ఎఫైర్ నిజమే అని ఒప్పుకున్న హీరో.... సెక్సీ సాంగుకు ఆవిడనే!
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కొన్ని రోజులుగా మలైకా అరోరాతో లవ్ ఎఫైర్ కొనసాగిస్తున్న విషయం బాలీవుడ్లో బహిరంగ రహస్యమే. ఈ విషయాన్ని ఇద్దరూ అఫీషియల్‌గా ఒప్పుకోక పోయినా... కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అర్జున్ కపూర్ తాను సింగిల్ కాదనే విషయాన్ని స్పష్టం చేశారు.
అర్జున్ కపూర్ నుంచి మలైకాకు సంబంధించిన విషయాలు రాబట్టే ప్రయత్నం కరణ్ జోహార్ చేసిప్పటికీ... తెలివిగా సమాధానాలు ఇచ్చాడు ఈ 33 ఏళ్ల కుర్ర హీరో. అయితే కరణ్ అడిగిన ఓ ప్రశ్నకు అర్జున్ కపూర్... మలైకా పేరును ఎంచుకోవడం గమనార్హం.

పెళ్లికి సిద్ధమే అని ప్రకటించిన అర్జున్
తాను సింగిల్ కాదు అని చెప్పిన అర్జున్ కపూర్... పెళ్లికి సిద్ధమేనా అంటూ కరణ్ అడిగిన ప్రశ్నకు ‘‘అవును'' అని సమాధానం ఇవ్వడం గమనార్హం. గతంతో పెళ్లి ఆలోచన లేదు, కానీ ఇపుడు పెళ్లికి రెడీ అని తేల్చి చెప్పాడు.

మలైకా పేరు రాకుండా జగ్రత్తగా
అయితే కరణ్ జోహార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా... అర్జున్ కపూర్ తన ప్రేయసి మలైకా అరోరా పేరు మాత్రం బయట పెట్టలేదు. దీంతో కరణ్ మరో ప్లాన్ వేసి ఏదో ఒక రకంగా మలైకా పేరు తన టాక్ షోలో అతడి నోట పలికించే ప్రయత్నం చేశాడు.

సెక్సీ సాంగుకు ఆవిడనే ఎంచుకుంటానన్న అర్జున్
నీ సినిమాలో ఒక సూపర్ సెక్సీ సాంగ్ చేయాలనుకుంటే కత్రినా కైఫ్, మలైకా అరోరాలో ఎవరిని ఎంచుకుంటావు అని కరణ్ అడ్డగా.... ‘చైయ్య చైయ్య సాంగుతో మలైకా ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆమెనే ఎంచుకుంటాను' అని నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు అర్జున్.

2019లో పెళ్లి అంటూ రూమర్స్
మలైకా అరోరా, అర్జున్ కపూర్ 2019లో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై ఇటీవల మలైకాను మీడియా వారు ప్రశ్నించగా... నా జీవితం గురించి అందరికీ తెలుసు, వ్యక్తిగత విషయాల గురించి స్పందించను అంటూ ఎస్కేప్ అయ్యారు. ఆమె నుంచి ఈ విషయంపై ఎలాంటి ఖండన రాక పోవడంతో పెళ్లి నిజమే అనే వాదనకు బలం చేకూరినట్లయింది.

త్వరలో ఇద్దరూ ఒకే అపార్టుమెంటులోకి..
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం త్వరలో ఇద్దరూ ఒకే అపార్టుమెంటులోకి మూవ్ అవ్వబోతున్నారట. ఇందుకోసం మలైకా అరోరా లోఖండ్‌వాలా కాంప్లెక్స్ సమీపంలో ఒక అపార్టుమెంటులో ఇల్లు కొనుగోలు చేసిందట.


Click it and Unblock the Notifications











