Deepika Padukone పెళ్లికి మూడేళ్ల ముందే ఆ పని.. సీక్రెట్ బయటపెట్టిన రణ్‌వీర్ సింగ్
డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా కాఫీ విత్ కరణ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హోస్ట్ చేసే 8వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నది. అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ షోతో వస్తున్నట్టు ఆయన ప్రోమోను రిలీజ్ చేశారు. 8వ సీజన్ తొలి ఎపిసోడ్‌లోనే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ షోలోకి రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్ జంటగా హాజరయ్యారు. ఈ షో వివరాల్లోకి వెళితే..
కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ తాజా ప్రోమోలో కరణ్ జోహార్, దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. దీపిక పదుకోన్‌తో సీక్రెట్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. 2015 సంవత్సరంలో నేను, దీపిక నిశ్చితార్థం చేసుకొన్నాం. ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2018లో వివాహం చేసుకొన్నాం. దీపిక కోసం మరోకరు రాకుండా ముందే సీట్‌లో చెప్పు పెట్టాను అని రణ్ వీర్ సింగ్ చెప్పారు. వెంటనే దీపిక స్పందిస్తూ.. ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్నాడు అని అంది.

ఇక కరణ్ జోహర్ రూపొందించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని సినిమాలో రణ్‌వీర్ కపూర్ పోషించిన రాకీ రాంధ్వా పాత్ర గురించి నీ అభిప్రాయాన్ని చెప్పమని దీపికను అడిగితే.. నేను రాకీ రాంధ్వా లక్షణాలు ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకొన్నాను అని చెప్పింది. రాకీ రాంధ్వా రోల్ ప్లే బాయ్ క్యారెక్టర్ మాదిరిగా ఉండటం తెలిసిందే.

కాఫీ విత్ కరణ్ షోలో దీపికను కరణ్ అడుగుతూ.. రణ్‌వీర్ సింగ్‌తో కాకుండా ఏ హీరోతో నీ కెమిస్ట్రీ బాగుంటుందని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. హృతిక్ రోషన్‌తో ఫైటర్ సినిమాలో అద్బుతమైన కెమిస్ట్రీ ఉంది. ప్రేక్షకులకు, అభిమానులు మంచి రొమాన్స్ చూడబోతున్నారు అని దీపిక పదుకోన్ చెప్పింది.
ఇండియన్ సినిమా రంగంలో అత్యంత ఇష్టపడే జోడి కాజోల్, షారుక్ ఖాన్ అని కరణ్ చెప్పారు. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ పండించడమే కాకుండా బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కితాబు ఇచ్చారు. అలాగే ఆలియా, రణ్‌వీర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. కానీ వారి మధ్య అంత గొప్పగా రిలేషన్‌షిప్ కనిపించదు అని కరణ్ జోహర్ అన్నాడు.

కాఫీ విత్ కరణ్ సీజన్ 8 విషయానికి వస్తే.. ఈ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానున్నది. ఈ సీజన్‌ను డిస్నీ+స్టార్ ఓటీటీలో అక్టోబర్ 26వ తేదీన స్ట్రీమింగ్ కానున్నది. ఈ షోలో ఇంకా దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ కలిసి సందడి చేయనున్నారు. ప్రోమోలో కాకుండా ఈ షోలో ఇంకా ఎలాంటి సంఘటనలు పంచుకొన్నారో అనే విషయం ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











