Koffee With Karan: అందుకే శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తుంటాను: కరణ్ జోహార్
నిర్మాతగా దర్శకుడిగా నటుడిగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ఇటీవల కాలంలో సౌత్ సినిమాలను కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల చేస్తూ భారీగానే క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అతను మొదలుపెట్టిన కాఫీ విత్ కరణ్ షో కూడా మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఆ షోలో అనవసరమైన బూతు ప్రశ్నలు ఎక్కువగా వేస్తారు అని ఆరోపణలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక ఆ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ దర్శకనిర్మాత స్పందించాడు.

శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు
కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షో మొదటి సీజన్ నుంచి కూడా విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెండు మూడు సీజన్ తర్వాత కరణ్ ప్రశ్నలు అడిగే విధానంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా గత రెండు సీజన్లో ఎక్కువగా కరణ్ జోహార్ శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

ట్రోలింగ్స్
ఇక రీసెంట్గా ఏడవ సీజన్ లో అయితే దాదాపు ప్రతి ఎపిసోడ్లో కూడా స్టార్ సెలబ్రిటీలను కరణ్ జోహార్ శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు చాలా అడిగాడు. హీరో హీరోయిన్ అని తేడా లేకుండా వారి మొహం మీదే అడల్ట్ కు సంబంధించిన సందేహాలు గురించి కరణ్ జోహార్ అడిగిన విధానం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురి అయ్యేలా చేసింది. ఇంతకంటే వేరే ప్రశ్నలు ఉండవా నీ దగ్గర అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కరణ్ జోహార్ రియాక్షన్
అయితే కాఫీ విత్ కరణ్ షో ఒక బూతు షో అని వస్తున్న ఆరోపణలకు కరణ్ జోహార్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి నేను దాదాపు అన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. అయితే ఆ సందర్భంగా కొన్నిసార్లు శృంగారంకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతుంటాను. బహుశా వారి వ్యక్తిగత జీవితంలో దాని గురించి నాకు తెలుసుకోవాలని అనిపిస్తుందేమో అని ఆలోచనతోనే ఆ విధంగా అడుగుతూ ఉంటాను అని కరణ్ జోహార్ అన్నారు.

వేరే ప్రశ్నలు కూడా..
అయితే తాను కేవలం శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు పరిమితం కాదు అని అలా కొన్ని మాత్రమే అడుగుతాను అని మిగతా రూట్లో అనేక రకాల విషయాల గురించి కూడా ప్రశ్నించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నట్లు కూడా కరణ్ జోహార్ తెలియజేశారు. అయితే మీడియా ఫోకస్ మాత్రం ఎక్కువగా అలాంటి ప్రశ్నల పైనే ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా హైలైట్ చేసినట్లు కూడా అతను వివరణ ఇచ్చాడు.

స్టార్స్ కూడా అదే తరహాలో..
కరణ్ జోహార్ ఎలాంటి సందేహం అడిగినా కూడా స్టార్ సెలబ్రిటీలు కూడా కొందరు డైరెక్టుగానే సమాధానం ఇవ్వడం మరింత వైరల్ అయింది. కొందరు హీరోయిన్స్ కూడా శృంగారం విషయంలో చాలా ఓపెన్ గా వారి వివరణ ఇవ్వడం కూడా ఆశ్చర్యపరిచింది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండను కూడా అదే తరహాలో అడిగే ప్రయత్నం చేశాడు. కానీ అతను తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నాడు.


Click it and Unblock the Notifications











