Shah Rukh Khan జవాన్ సినిమాకు మరో సమస్య.. డైరెక్టర్ అట్లీపై నిర్మాత పిర్యాదు!
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు అపజయం లేకుండా కొనసాగుతున్న దర్శకులలో అట్లీ ఒకరు. విజయ్ తో వరుసగా బాక్సాఫీస్ విజయాలను అందుకున్న అట్లీ ఇప్పుడు షారుక్ ఖాన్ హీరోగా జవాన్ అనే సినిమాను తెరపైకి తీసుకువస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే షారుక్ ఖాన్ తో పాటు జవాన్ సినిమాలో విజయ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ అయితే వస్తుంది.
ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మొదట సమంతను అనుకున్నప్పటికీ ఆ తర్వాత నయనతారను సెలెక్ట్ చేసుకున్నారు. ఇక జవాన్ సినిమాకు సంబంధించిన ఒక వివాదం ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దర్శకుడు అట్లీ కథను కాపీ కొట్టాడు అంటూ ఒక ప్రముఖ నిర్మాత తమిళ నిర్మాత మండలి లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత అట్లీ జవాన్ కథ గురించి తెలుసుకొని ఆ కథ తమ సినిమాలోది అని అతను ఆరోపించారు. తమ ప్రొడక్షన్ లో వచ్చిన 2006 విజయ్ కాంత్ పేరరసు అనే సినిమా కథనే అట్లీ జవాన్ సినిమా పేరుతో హిందీలో నిర్మిస్తున్నారంటూ నిర్మాత మాణిక్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై త్వరలోనే నిర్మాతల మండలి అట్లీతో చర్చలు జరపనుంది.
అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై దర్శకుడు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జవాన్ సినిమాను హిందీలోనే కాకుండా తమిళ్ తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కథ కోసం దాదాపు మూడేళ్లపాటు కష్టపడిన అట్లీ మొత్తానికి ఈ ఏడాది సినిమాను పట్టాలు ఎక్కించాడు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసే వచ్చే ఎ ఏడాదే చివరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరోవైపు షారుఖ్ నుంచి పటాన్ అనే సినిమా రానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











