twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీవు జైలుకు వెళ్లు.. కోన వెంకట్‌కు ఝలక్.. సల్మాన్‌కు సపోర్ట్‌పై రఫ్ఫాడిన నెటిజన్లు

    By Rajababu
    |

    Recommended Video

    Salman Was Supported By Writter Kona Venkat

    కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సల్మాన్‌కు శిక్ష విధించడంపై కొందరు సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు చట్టానికి ఎవరూ అతీతులు కాదు అని వాదన వినిపించారు. సల్మాన్ ఖాన్‌కు జైలుశిక్ష విధించారనే వార్త నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్, మాటల రచయిత కోన వెంకట్ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ కోన వెంకట్ వాదనను తప్పు పడుతూ నెటిజన్లు తీవ్రమైన పదజాలంతో ఆయన వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇంతకు కోన వెంకట్ ఏమన్నారంటే..

     కోన వెంకట్ ట్వీట్ ఇదే

    కోన వెంకట్ ట్వీట్ ఇదే

    సల్మాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వెల్లడించిన తీర్పు విని చాలా షాక్‌కు గురయ్యాను. ఆయన క్యారెక్టర్‌పై ఇప్పుడు చర్చ చేయడం సరికాదు. చాలా దేశాల్లో జంతువులను వేటాడటం చట్టపరంగా అనుమతి ఉంది. పర్యావరణ సమతుల్యాన్ని పాటించడానికి ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకొంటున్నాయి. మనుషులను ముందు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో నేను సల్మాన్ ఖాన్‌కు అండగా నిలుస్తాను అని కోన వెంకట్ ట్వీట్ చేశారు.

    కోన వెంకట్ రెండో ట్వీట్

    కోన వెంకట్ రెండో ట్వీట్

    మొదట చేసిన ట్వీట్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం కావడంతో కోన మరో ట్వీట్ చేశారు. సల్మాన్ ఖాన్‌కు సపోర్టు చేసినందుకు మీరు హర్ట్ అయ్యారని తెలుసుకొన్నాను. కానీ సల్మాన్ ఖాన్‌కు జరిగిన దానికి నాకు చాలా ఎక్కువ బాధగా ఉంది. తేళ్లు, పాములతోపాటు ఎలాంటి జంతువును కూడా చంపడాన్ని నేను ఒప్పుకోను. జంతువులైనా మనుషులైన ఒకటే. ముందు మనం మానవత్వానికి సపోర్ట్‌గా నిలుద్దాం. నేను వాదన మీకు అర్థం అయిందనుకొంటాను అని మరో ట్వీట్‌లో కోన పేర్కొన్నారు.

     మనుషులను వేసేయాలి..

    మనుషులను వేసేయాలి..

    కోన వెంకట్ ట్వీట్‌పై నెటిజన్లు నానా రకాలుగా స్పందించారు. పర్యావరణ సమతుల్యతను పాటించాలంటే మనుషులను వేసేయాలి. కృష్ణ జింకలు మిగిలిందే కొన్నిసార్. దయచేసి ఇలాంటి విషయాలను మీరు వదలేయ్యండి అని ఓ నెటిజన్ సమాధానం ఇచ్చారు.

    ప్రత్యేక హోదా గురించి ట్వీట్ చేయి

    ప్రత్యేక హోదా గురించి ట్వీట్ చేయి

    మరో వ్యక్తి ఇందేటి తెగ ఫీల్ అయిపోతున్నాడు అని అన్నాడు. ఏపీ ప్రత్యేక హోదా గురించి ఒక్క ట్వీట్ ఉండదు కానీ.. అబ్బో ఎక్కడో జోధ్‌పూర్‌లో జింకని చంపిన బొంబాయి వాసి సల్మాన్ ఖాన్ మీద పేరాగ్రాఫ్‌లు, పేరాలు మించి ట్వీట్ చేసేస్తున్నాడు అని ఓ నెటిజన్ కామెంట్ విసిరాడు.

     సల్మాన్‌కు బదులు నీవు జైలుకు వెళ్లు

    సల్మాన్‌కు బదులు నీవు జైలుకు వెళ్లు

    ‘అంత బాధగా ఉంటే సల్మాన్ ఖాన్‌కు బదులు నీవు జైలుకు వెళ్లు', హిట్ అండ్ రన్ కేసులో చనిపోయిన వ్యక్తి గురించి కూడా మీరు పట్టించుకోవాలి కదా, మీ ట్వీట్లు ఏపీ స్పెషల్ స్టేటస్ మీద వస్తే ఇంకా బాగుండేది. శ్రీరెడ్డి ఇష్యూపై కూడా స్పందించండి అని రకరకాల ట్వీట్లు చేశారు.

    లాజిక్ సరిగా లేదు..

    లాజిక్ సరిగా లేదు..

    సల్మాన్ విషయంలో మీ లాజిక్ కరెక్ట్‌గా లేదు. కొరియాలో ప్రజలకు స్వాతంత్ర్యం లేదని, ఇండియాలో కూడా తీసేస్తారా? సల్మాన్ ఇప్పుడు మంచోడే అయి ఉండోచ్చు. కానీ మీ లాజిక్ మాత్రం అసులు బాగాలేదు.

     మీరు వేరే దేశం వెళ్లండి

    మీరు వేరే దేశం వెళ్లండి

    సెలబ్రిటీల కోసం చట్టాలు, న్యాయం మార్చాలా? మా దేశంలో జంతువులను వేటాడటానికి అనుమతి లేదు సార్. వాటిని మీరు వేటాడాలంటే వేరే దేశానికి వెళ్లండి.

     మైండ్ ఉండి మాట్లాడుతున్నారా?

    మైండ్ ఉండి మాట్లాడుతున్నారా?

    మనుషులను కాపాడాలా? అసలు మన పాపులేషన్ ఎంతో తెలుసా? పర్యావరణ సమతుల్యత లేక చాలా ప్రదేశాల్లలో వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. అసలు మైండ్ ఉండి మాట్లాడుతున్నారా? నీ సినిమాలు పోవడంలో తప్పేమీ లేదు. నీవు నీ చెత్త ట్వీట్స్. సల్మాన్‌కు సపోర్ట్ చేయాలంటే జైలుకు వెళ్లి ఓదార్చు అని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.

    English summary
    Bollywood icon Salman Khan has been sentenced to five years in jail after a court in Jodhpur convicted him of killing two blackbucks 19 years ago. He has also been slapped with a fine of Rs 10,000. Salman will now have to approach the Rajasthan High Court in order to get bail since his punishment exceeds three years, meaning he will spend tonight in jail. In this occassion, Tollywood celebrity Kona Venkat supproted Salman. but netizen reacted negitively to his tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X