మూడేళ్లు డేటింగ్.. ఐదేళ్ల దాంపత్య జీవితానికి హీరోయిన్ గుడ్ బై
బాలీవుడ్‌లో మరో జంట వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. విలక్షణ తార కొంకణ సేన్‌శర్మ, రణ్‌వీర్ ష్రాయ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారని బాలీవుడ్ మీడియా కథనాలను వెల్లడించింది. అయితే వారు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాలని తీసుకొన్న నిర్ణయం వెనుక కారణాలను వెల్లడించడకపోవడం గమనార్హం. అయితే వీరి డైవోర్స్‌పై బాలీవుడ్‌లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

ఆరు నెలల తర్వాత విడాకులు
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. కొంకణ సేన్‌శర్మ, రణ్‌వీర్ ష్రాయ్ పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసుకొన్నారు. కోర్టు నిబంధనల ప్రకారం మరో ఆరు నెలల తర్వాత వారికి విడాకులు అధికారికంగా లభిస్తాయి. వారిద్దరిని కౌన్సిలింగ్‌కు పంపించి లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేసిన తర్వాత వారి అంతిమ నిర్ణయం ప్రకారం విడాకులు మంజూరు చేస్తారు అని వెల్లడైంది.

మూడేళ్లు డేటింగ్
కొంకణ సేన్‌శర్మ, రణ్‌వీర్ ష్రాయ్ జంట ట్రాఫిక్ సిగ్నల్, ఆజా నాచ్లే, గౌరీ హరి దస్తాన్ అనే చిత్రాల్లో కలిసి నటించారు. పెళ్లికి ముందు మూడేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2010 సెప్టెంబర్‌లో వారిద్దరూ వివాహం చేసుకొన్నారు. 2011లో వారికి హరూన్ అనే మగ పిల్లవాడు జన్మించారు. వారి దాంపత్య జీవితం హ్యాపీగా గడుస్తున్నదని అనుకొంటుండగానే వారి మధ్య అభిప్రాయ బేధాలు చోటుచేసుకొవడం జరిగింది.

తీవ్రస్థాయికి అభిప్రాయ బేధాలు
కొంకణసేన్, రణ్‌వీర్ మధ్య చోటుచేసుకొన్న అభిప్రాయ బేధాలను పరిష్కరించడానికి సన్నిహితులు పలు రకాలుగా ప్రయత్నించారు. కానీ వారి మధ్య అభిప్రాయ బేధాలు పరిష్కారం కాకపోవడంతో చివరకు విడిపోవాలని నిర్ణయించుకొన్నారు బాలీవుడ్ మీడియా తమ కథనాల్లో పేర్కొన్నది. కొంకణ్ సేన్ దంపతులు విడిపోవాలని నిర్ణయం తీసుకోవడంపై స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Recommended Video


పరస్పర అవగాహనతో
తాజాగా రణ్‌వీర్ ష్రాయ్‌తో విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా కొంకణ సేన్ వెల్లడించారు. పరస్పర అవగాహనతో రణ్‌వీర్ నేను విడిపోవాలని నిర్ణయించుకొన్నాం. కానీ స్నేహితులుగా ఉండిపోతాం. నా కుమారుడి బాధ్యతలను ఆరోగ్యకరమైన వాతావరణంలో పంచుకోవాలని నిర్ణయించుకొన్నాం అని కొంకణసేన్ ట్వీట్ చేశారు. అదే మెసేజ్‌ను రణ్‌వీర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











