అక్కా చెల్లెల్లను భలే రఫాడించాడు.. చీప్ పబ్లిసిటీ కోసం అంటూ.. కంగనపై క్రిష్ ఫైర్

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథతో తెరకెక్కించిన మణికర్ణిక చిత్రానికి సంబంధించిన వివాదం మీడియాలో రచ్చగా మారింది. దర్శకత్వం విషయంలో కంగన రనౌత్, క్రిష్ జాగర్లమూడి మధ్య మాటల యుద్ధం గత రెండు రోజులుగా ఊపందుకొన్నది. ఈ వివాదంపై కంగన స్వయంగా క్రిష్‌పై మాటల విసరడమే కాకుండా ఆమె చెల్లెలు రంగోలి కూడా ఈ వివాదానికి ఆజ్యం పోసింది. రంగోలి చేసిన వ్యాఖ్యలకు క్రిష్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

 మణికర్ణిక వివాదం ఇలా

మణికర్ణిక వివాదం ఇలా

మణికర్ణిక సినిమాకు తొలుత క్రిష్, ఆ తర్వాత కంగన రనౌత్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోజిక్ అవకాశం రావడంతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకోవడం జరిగింది. క్రిష్ స్థానంలో కంగన రనౌత్ రంగ ప్రవేశం చేసి మిగితా భాగాన్ని పూర్తి చేశారు. అయితే టైటిల్స్‌లో డైరెక్టర్ పేరును కంగన రనౌత్ అని వేసుకోవడం వివాదంగా మారింది.

 క్రిష్ క్రెడిట్ కొట్టేద్దామని

క్రిష్ క్రెడిట్ కొట్టేద్దామని

మణికర్ణిక సినిమా హిట్ అయిన తర్వాత దాని క్రెడిట్‌ను క్రిష్ కొట్టేయాలనుకొంటున్నారు. చేయని పనికి కూడా ఫలితాన్ని ఆశిస్తున్నారు. క్రిష్‌ ప్రవర్తన సరిగా లేదంటూ కంగన రనౌత్ చెల్లెలు రంగోలి నోరు జారారు. రంగోలి చేసిన వ్యాఖ్యలపై క్రిష్ గరం అయ్యారు. కంగన కూడా చేయని పనికి క్రెడిట్ కొట్టేయాలని చూస్తారని రంగోలికి చెప్పాలనుకొంటున్నాను అని కౌంటర్ ఇచ్చారు.

నాకు వాళ్ల ప్రశంసలు అవసరం లేదు

నాకు వాళ్ల ప్రశంసలు అవసరం లేదు

మణికర్ణిక సినిమాకు పూర్తి స్థాయిలో నేను కష్టపడ్డాను. చివర్లో కొంత మేరకు కంగన రనౌత్ దర్శకత్వం చేసింది. దానికి ఆమె మొత్తం క్రెడిట్ కొట్టేసింది. నా ప్రతిభ గురించి కంగననో లేదా ఆమె చెల్లెలు నాకు కితాబు ఇవ్వనవసరం లేదు. నా కెరీర్‌లో మణికర్ణిక తొమ్మిదో సినిమా. చారిత్రాత్మక చిత్రాలు నేను ఇంతకు ముందే తీశాను. ఇక ముందు కూడా తీస్తాను అని క్రిష్ ఫైర్ అయ్యారు.

హైజాక్ చేయడం సరికాదని

హైజాక్ చేయడం సరికాదని

దర్శకత్వం విషయంలో కంగన ఇంత చీప్ వ్యవహరిస్తే.. ఆమెతో పనిచేయడానికి ఎవరైనా ముందుకొస్తారా? డైరెక్టర్‌ను కించపరుస్తూ ప్రాజెక్ట్‌ను హైజాక్ చేయడం సరికాదు. నేనంత పనిచేశానో చిత్ర యూనిట్‌కు బాగా తెలుసు. నేనేమి కొత్త డైరెక్టర్‌ను కాదని రంగోలి తెలుసుకోవాలి అని క్రిష్ అన్నారు.

కంగన రనౌత్, విద్యాబాలన్ టాలెంటెడ్

కంగన రనౌత్, విద్యాబాలన్ టాలెంటెడ్

అయితే కంగన‌ నటన, ప్రతిభపై క్రిష్ ప్రశంసల వర్షం కురిపించడం ఆయన గొప్పతనానికి నిదర్శనంగా మారింది. నేను కంగన, విద్యాబాలన్‌తో కలిసి పనిచేశాను. ఇద్దరూ టాలెంటెడ్ యాక్టర్లు. వారిద్దరూ సెట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వాళ్లు కనిపిస్తూ ఆందోళన, టెన్షన్ అంతా మాయం అవుతుంది అని క్రిష్ చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X