లాక్ డౌన్ వేళ దిషా పటానీ, టైగర్ ఒకే ఇంట్లో!.. మా ముగ్గురికి అది ఇష్టం.. హీరో సోదరి క్లారిటీ

కరోనా వైరస్‌తో ప్రపంచం అంతా అట్టుడికిపోతోంది. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్‌ను విధించాయి. ఈ మేరకు మన దేశంలోనూ గత నెల రోజులుగా లాక్ డౌన్ అమల్లోనే ఉంది. ఈ మేరకు ప్రజంలతా ఇంటికే పరిమితమయ్యారు. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు తప్పా.. ఎవ్వరినీ రోడ్లపైకి తిరిగేందుకు అనుమతినివ్వడం లేదు. ఈ క్రమంలో స్టార్ సెలెబ్రిటీల నుంచి సామాన్య జనం వరకు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు.

Recommended Video

Tiger Shroff And Disha Patani In Lockdown, Krishna Shroff Clarifies
 ఎక్కడివారు అక్కడే..

ఎక్కడివారు అక్కడే..

లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లిన వారు అక్కడే ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ తన ప్రియురాలితో ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోయాడు. హృతిక్ రోషన్, మాజీ భార్య సుహానే ఖాన్ ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఇలా ఈ లాక్ డౌన్‌లో కొత్త అన్నీ వింతగా కొత్తగా జరుగుతున్నాయి.

కొత్తజంట సైతం..

కొత్తజంట సైతం..

బాలీవుడ్‌లో కొత్త జంటలకు కొదువే లేదు. ప్రేమలు మొలకెత్తుతూనే ఉంటాయి.. మధ్యలోనే బ్రేకప్‌లు జరుగుతూ ఉంటాయ్.. మళ్లీ ప్రేమలు చిగురిస్తూనే ఉంటాయి. అయితే దిషా పటానీ, టైగర్ ష్రాఫ్‌ల మధ్య ఉన్న బంధం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. కనిపించేది ఒకటైతే.. చెప్పేది మరొకటి ఉంటుంది. అయితే వీరిద్దరు ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

చెట్టాపట్టాలేసుకుని..

చెట్టాపట్టాలేసుకుని..

దిషా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు వెండితెరపై ఎంత సందడి చేస్తారో.. బయట పార్టిల్లోనూ అలానే దుమ్ములేపుతారు. అది ఏ ఈవెంట్ అయినా వీరిద్దరి కలిసే హాజరవుతారు. ఇవన్నీ చూశాకే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు వచ్చాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని దాట వేస్తుంటారు.

లాక్ డౌన్ వేళ ఒకే ఇంట్లో..

లాక్ డౌన్ వేళ ఒకే ఇంట్లో..

లాక్ డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండాల్సి వచ్చింది. స్టార్ సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి పట్టునే ఉంటూ వారిలోని నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. కొందరు వంటింట్లో దూరితే మరికొందరు డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాయామం అంటూ సరదాగా గడిపేస్తున్నారు. అందరూ ఇలా ఉంటే వీరిద్దరు మాత్రం ఒకే ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

 టైగర్ సోదరి క్లారిటీ..

టైగర్ సోదరి క్లారిటీ..

టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ ఈ వార్తలపై స్పందిస్తూ.. దిషా పటానీ మా ఇంట్లో లేదు.. మా ఇంటికి దగ్గర్లో ఉంది.. అప్పుడప్పుడు మేము బయటకు వెళ్లి నిత్యావసర సరకులు తెచ్చుకుంటాము.. మా ముగ్గురికి ఫిట్‌నెస్ అంటే ఇష్టం.. అందుకే మంచి స్నేహితులమయ్యామని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X