గోవాలో పార్టీ: ప్రముఖ నటుడి కూతురు రచ్చ రంబోలా...
ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక పోయినా సోషల్ మీడియాలో ద్వారా తెగ పాపులర్ అవుతున్నారు. హాట్ హాట్ ఫోటోస్ పోస్టు చేస్తూ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తనకంటూ మంచి ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన ఆమె బికినీలో అందాలు ఆరబోసి అభిమానులను కవ్విస్తోంది.

గోవాలో పార్టీ మూడ్లో...
ప్రస్తుతం కృష్ణ ష్రాఫ్ తన స్నేహితులతో కలిసి గోవాలో మంచి పార్టీ మూడ్లో ఉన్నారు. అక్కడ వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ఖుషీ ఖుషీగా జల్సాలు చేస్తూ గడుపుతున్నట్లు ఆమె పోస్టు చేసిన ఫోటోలను చూసి అర్థం చేసుకోవచ్చు.

బికినీలో హాట్ ఫోజులు
ఒకప్పుడు కృష్ణ ష్రాఫ్ కాస్త బొద్దుగా, బికినీకి అంతగా సూటవ్వని శరీర సౌష్టవంతో ఉండేది. అయితే ఈ మధ్య అందం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిన ఈ బ్యూటీ సెక్సీ లుక్ లోకి మారిపోయింది. ఎంతో కష్టపడి పెంపొందించుకునన తన అందాన్ని ఇలా బికీనల్లో ప్రదర్శిస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.

సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?
కృష్ణ ష్రాఫ్ జోరు చూస్తుంటే ఆమె తన అందాలను సిల్వర్ స్క్రీన్ మీద ప్రదర్శించాలని ఆసక్తిగా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ సినిమాలకు ఆమె సూటవుతుందని కొందరు అభిమానులు అంటున్నారు.

ఫ్యామిలీ పలుకుబడితో
తండ్రి జాకీ ష్రాఫ్ సీనియర్ నటుడు, సోదరుడు టైగర్ ష్రాఫ్ హీరోగా రాణిస్తున్నాడు. కృష్ణా ష్రాఫ్ నటిగా తెరంగ్రేటం చేస్తే బాలీవుడ్లో ఆమె ఫ్యామిలీకి ఉన్న పలుకుబడితో పెద్దగా కష్టపడకుండానే అవకాశాలు దక్కించుకోవచ్చని అంటున్నారు.


Click it and Unblock the Notifications











