అమ్మాయిలకు అవి నేర్పితే హత్యాచార ఘటనలు జరగవు.. పొలిటీషియన్ వ్యాఖ్యలపై హీరోయిన్ ఫైర్
ఒక హత్యాచార ఘటనపై రాజకీయ నాయకుడు స్పందించిన తీరుకు బాలీవుడ్ నటి కృతి సనన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్న కృతి హాథ్రస్ హత్యాచార ఘటనపై కూడా మొదటి నుంచి తన ఆవేదనను తెలుపుతూనే ఉంది. అయితే ఆ ఘటనపై కొందరు స్పందిస్తున్న తీరు కాంట్రవర్సీగా మారుతోంది. కేవలం కృతి అనే కాకుండా చాలా మంది ప్రముఖులు ఒక పొలిటీషియన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

ఆడపిల్లలను అలా పెంచాలి
ఆ రాజకీయ నేత మరెవరో కాదు. యూపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. ఆడపిల్లలను తల్లి దండ్రులు సంస్కారంతో పాటు మంచి విలువలతో పెంచాలి. కట్టుబాట్లు కూడా మంచివే. అలా పెంచితేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ప్రభుత్వాలు కేవలం రక్షణ మాత్రమే కల్పిస్తాయను చెప్పారు. ఇక ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన కృతి సనన్
ఇదే వివాదంపై 1 నేనొక్కడినే నటి కృతి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఆయనకు కొంచెమైనా అర్థమవుతోందా? అసలు ముందు ఇలాంటి మనుషుల మనస్తత్వం మారకతప్పదు. ఆయన చేసిన కామెంట్స్ స్పందించిన విధానం చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. ఇన్ని ఘటనలు జరుగుతుంటే అబ్బాయిలకు తల్లిదండ్రులు సంస్కారం ఎందుకు నేర్పకూడదు.. అని కృతి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

కృతి సనన్ కి మద్దతు పలికిన నెటిజన్స్
కృతి సనన్ స్పందించిన విధానానికి నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. ఇదివరకే ఈ ఘటనపై చాలా మంది హీరోయిన్స్ స్పందించారు. అయితే ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలకు ధైర్యంగా సమాధానం ఇచ్చింది కృతి సనన్. ఆమె ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటున్న ఫాలోవర్స్ ఆ నేతపై విమర్శలు కురిపిస్తున్నారు.l
Recommended Video

ఈ విధంగా ఎవరైనా స్పందిస్తారా?
ఇక కృతి సనన్ తో పాటు మరో నటి స్వర భాస్కర్ కూడా ఆ ఎమ్మెల్యే కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఒక అమాయకురాలిపై దాడి జారిగితే ఈ విధంగా ఎవరైనా స్పందిస్తారా అంటూ.. అతను ఒక పాపి కంటే హీనమైన వ్యక్తి అంటూ స్వర భాస్కర్ తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కాజల్ అగర్వాల్ కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ విధానంలో వీలైనంత త్వరగా మార్పు రావాల్సి ఉందని వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











