గృహ నిర్బంధంలో ప్రియుడితో పవన్ హీరోయిన్.. నో సోషల్ డిస్టెన్స్, రూల్స్ బ్రేక్
కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సినీతారల్లో చాలా మంది ప్రేమికులు దూరంగా ఉంటూ విరహా వేదనను అనుభవిస్తున్నారు. గత నెల రోజులుగా కలుసుకోలేక సోషల్ మీడియాలో పోస్టుల పెడుతూ తమ మధ్య ఎడబాటును బాధతో పంచుకొంటున్నారు. అయితే ప్రియుడికి దూరంగా ఉండకుండా.. పక్కన పెట్టుకొన్న కృతి ఖర్బంధా అదృష్టాన్ని చూసి అందరూ కుళ్లుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నా ప్రియుడు నా పక్కనే ఉండటం ఎంత బాగుందంటూ కృతి చెప్పిన విషయాలు ఏమిటంటే..

తమ్ముడి ఎంగేజ్‌మెంట్ కోసం వెళ్లి
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడానికి ముందు కృతి ఖర్బంధా ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణించింది. తన తమ్ముడి ఎంగేజ్‌మెంట్ కోసం దేశ రాజధానిలో పర్యటించిన సమయంలో దగ్గు, జలుబు అంటుకొన్నాయి. ముంబైకి వచ్చిన తర్వాత తీవ్రం కావడంతో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాను అని కృతి తెలిపారు.

కరోనా నిర్ధారణ పరీక్షలు
కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కిట్లు లభ్యం కాకపోవడంతో టెస్టులు చేయించుకోలేదు. అలాంటి సమయంలో వైరస్ సోకిందా లేదా అనేది పరీక్షించుకోలేదు. జ్వరం కూడా లేకపోవడంతో డాక్టర్లు సోషల్ డిస్టెన్స్ పాటించమని సూచించారు. దాంతో లక్షణాలను స్వయంగా పరీక్షించుకోమని చెప్పారు. ఆ తర్వాత మూడు రోజులు మంచానికే పరిమితమయ్యాను అని కృతి చెప్పారు.

కఠిన సమయాల్లో ప్రియుడు తోడుగా
ఇలాంటి కఠిన సమయాల్లో నాకు తోడుగా పుల్కిత్ సామ్రాట్ ఉండటం చాలా ధైర్యంగా కలిగించింది. మేమిద్దరం ఒకటే బిల్డింగ్‌లో ఉండటం నాకు చాలా ఉపశమనం కలిగించింది. నేను అనారోగ్యం బారిన పడినప్పుడు ఆయన నాతో ఉండటం కొండంత అండగా అనిపించింది అని కృతి ఖర్బందా తెలిపారు.

ప్రేమికులు ఎలా విడివిడిగా..
కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రేమ జంటలు వేర్వేరుగా ఉంటూ ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. వారి బాధలను ఊహించుకొంటేనే చాలా బాధగా ఉంది. వేర్వేరుగా ఉంటూ లాక్‌డౌన్‌ను ఎలా భరిస్తున్నారో తెలియడం లేదు అని కృతి అన్నారు.
Recommended Video

పవన్ కల్యాణ్ హీరోయిన్‌గా కృతి కెరీర్ ఇలా..
కృతి, పుల్కిత్ ఇద్దరూ కలిసి రెండు చిత్రాల్లో నటించారు. వీరే కి వెడ్డింగ్, పాగల్‌పంతి చిత్రాల్లో కలిసి నటించారు. పుల్కిత్ ప్రస్తుతం రానా దగ్గుబాటితో కలిసి హాథీ మేరి సాథి చిత్రంలో నటిస్తున్నారు. కృతి తమిళంలో వాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. కృతి బోణి చిత్రంతో తెలుగులోకి ప్రవేశించి నానితో అలా మొదలైంది, పవన్ కల్యాణ నటించిన తీన్మార్, ఒంగోలు గిత్త తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.


Click it and Unblock the Notifications











