అతను అసభ్యంగా ప్రవర్తించాడు.. ఎప్పటికీ మర్చిపోలేను: 'ఆదిపురుష్' సీత కృతిసనన్
బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలిన తర్వాతి కాలంలో బ్లాక్ బస్టర్ మూవీ అని ప్రేక్షకులచేత అనిపించుకుంది. దీని తర్వాత కృతి సనన్ చేసిన దోచెయ్ కూడా ప్లాప్ గా మిగలడంతో మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది ఈ బ్యూటి. ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించేందుకు రెడీ అయింది. అయితే ఈ ముద్దుగుమ్మతో సినీ ఇండస్ట్రీలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని తాజాగా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటి కృతి సనన్ ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది కృతి సనన్ నటించిన హమ్ దో హమారే దో (ఓటీటీ), బచ్చన్ పాండే, భేడియా చిత్రాలు వరుసగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇలా ఆ ఏడాది చేసిన ప్రతి సినిమా పరాజయంతో ఫ్లాప్ హీరోయిన్లలో ఒకరిగా కృతి సనన్ నిలిచింది. ఈ సంవత్సరం వచ్చిన షెహజాదే మూవీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు జూన్ 16న విడుదల కానున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. "నేను మోడలింగ్ కెరీర్ లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి వాతావరణం, వ్యక్తుల గురించి పెద్దగా తెలియవు. అర్థం చేసుకుంటున్నాను. ఆ సమయంలో ఓ ర్యాంప్ షోలో వాక్ చేసే అవకాశం వచ్చింది" అని కృతి సనన్ తెలిపింది.

"ఆ ర్యాంప్ షోకి వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ నన్ను అవమానించడమే కాకుండా.. నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అది నాకెంతో బాధను కలిగించింది. కెరీర్ ను వదిలేద్దామనుకుని అమ్మకు ఫోన్ చేశాను. ప్రతీ చోట ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. వాటిని దాటినప్పుడే సక్సెస్ వస్తుంది అని ఆమె చెప్పింది. ఆమె అలా అనటం వల్లే ఇక్కడ ఉన్నాను. అమ్మా మాటలను ఎప్పటికీ మర్చిపోలేను" అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. కాగా ఆదిపురుష్ తోపాటు మరో మూడు చిత్రాలు చేస్తుంది కృతి సనన్. వాటిలో ఒకటి టైగర్ ష్రాఫ్ తో 'గణ్‌పత్', మరోకటి 'ది క్రూ' ఉన్నాయి. మరో చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు.


Click it and Unblock the Notifications











