Krithi Sanon fires : చాలా ఘోరంగా యాంగిల్ బాలేదంటారా, అది పర్సనల్ కదా?
కృతి సనన్ బాలీవుడ్ కి చెందిన ఫోటో గ్రాఫర్ల మీద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వారు తనకు ఏమాత్రం ఇష్టం లేదని కూడా చెప్పింది. దిలీప్ కుమార్ అంత్యక్రియల వీడియోల మీడియా కవరేజీకి వ్యతిరేకంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలాంటి సందర్భాలలో కవరేజీపై మరోసారి ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.ఒక మీడియా సంస్థతో తాజా సంభాషణలో, కృతి సనన్ ఫోటో గ్రాఫర్ల గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఈ ఫోటో గ్రాఫర్ల చనిపోయిన వారి అంత్యక్రియలు ఫోటోలు చిత్రాలు మరియు వీడియోలను తీసుకోకూడదని కృతి ఇప్పటికే చెప్పారు.
అభిమానులు తమ అభిమాన తారలను చివరిగా చూడాలనుకున్నప్పుడు ఆమె ఎందుకు ఇలా ఆలోచిస్తుందని అడిగినప్పుడు, కృతి, మాట్లాడుతూ "నేను ఆ వీడియోలను (దిలీప్ కుమార్) చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చిందని పేర్కొంది. ఇది చాలా భయంకరమైనదన్న కృతి నేను అనుకున్న మొదటి విషయం ఏమిటంటే అంత్యక్రియలు కవర్ చేయాల్సిన అవసరం లేదని, ఇవి చాలా వ్యక్తిగత విషయాలని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ, 'మీరు రేపు ఈ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తే, మీ కుటుంబం దానిని ప్రతిచోటా చూపించకూడదనుకుంటుంది. ప్రజలు దీన్ని ఎందుకు చూడాలనుకుంటున్నారు, అది ప్రైవేట్‌గా ఉండనివ్వండి.

రెండవది, మీరు కవర్ చేస్తున్నప్పుడు కెమెరా వెనుక నుండి ఎందుకు మాట్లాడుతున్నారు, కనీసం అప్పుడు మ్యూట్ అవ్వండని సూచించారు. కానీ వారు వింతైన పనులు చేస్తారని, సరైన యాంగిల్ దొరకనప్పుడు నవ్వుతారని, పక్కపక్కనే ఉన్నందుకు ఒకరినొకరు అరుచుకుంటారని ఇవన్నీ చూడటం చాలా బాధగా ఉందని అన్నారు.
దిలీప్ కుమార్ మరణం తరువాత తాను చేసిన పోస్టుతో తాను ఇంకా అంగీకరిస్తున్నానని కృతి అన్నారు. ఇది ఏమైనా మార్పులు తెస్తుందో లేదో తెలియదు కానీ దానికి వ్యతిరేకంగా స్వరం పెంచాలని తాను భావించానని చెప్పారు. దిలీప్ కుమార్ వీడియోలు చూసి తనకు కోపం వచ్చిందని కృతి పేర్కొంది. ఫోటో గ్రాఫర్ల ఇలాంటివి కవర్ చేయాలనుకుంటే వారు కెమెరా వెనుక మాట్లాడకూడదని కృతి పేర్కొంది.


Click it and Unblock the Notifications











