బాలీవుడ్ జంట బ్రేక్ అప్.. చిచ్చు పెట్టిన యంగ్ బ్యూటీ!
సినీ తరాల ప్రేమ వ్యవహారాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది బాలీవుడ్. హీరో హీరోయిన్ల మధ్య ఎప్పుడూ అక్కడ ప్రేమ కథల రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. రాబ్తా చిత్రంలో సుశాంత్, కృతి సనన్ జంటగా నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించింది. తరచుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని మీడియా కంట కనిపించడంతో వీరి మధ్య జోరుగా ప్రేమాయణం సాగుతోందని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.
తాజాగా ఈ రొమాంటిక్ జంట మధ్య బ్రేక్ అప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ విడిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయని బాలీవడో మీడియాలో ప్రచారం జరుగుతోంది. కృతి సనన్, సుశాంత్ ఇద్దరూ తమ కెరీర్ పై దృష్టి పెట్టాలని ఇంతటితో రిలేషన్ షిప్ బ్రేక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది పైకి వినిపిస్తున్న కారణం కానీ అసలు కారణం వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలం నుంచి సుశాంత్ మరో అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో మనస్తాపం చెందిన కృతి సనన్ అతడి నుంచి విడిపోయిందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. సంజన సంఘీ అనే యంగ్ బ్యూటీ, సుశాంత్ ఈ మధ్య చాలా చనువుగా ఉంటున్నారట.


Click it and Unblock the Notifications











