‘ఆదిపురుష్’లో సీతగా ఆ హీరోయినే ఫైనల్: ప్రకటనకు ముందే బయటకు వచ్చిన మేటర్

టాలీవుడ్‌లోకి హీరోగా పరిచయం అయిన చాలా కాలం పాటు తెలుగు సినిమాల్లోనే నటిస్తూ వచ్చాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అయితే, దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సిరీస్‌ నుంచి అతడు పంథాను మార్చుకున్నాడు. ఆ వెంటనే 'సాహో' అనే పాన్ ఇండియా సినిమా చేసిన యూనివర్శల్ స్టార్ హీరో.. దాని తర్వాత కూడా వరుసగా అదే తరహా చిత్రాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే నేరుగా ఓ హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాడు. అదే.. 'ఆదిపురుష్'. ఈ సినిమా ద్వారానే ప్రభాస్ బాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. రామయాణం నాటి కథతో రూపొందుతోన్న ఈ చిత్రం చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో వస్తోంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. ఇక, ఇందులో అత్యంత ముఖ్యమైన సీత పాత్రను పోషించే హీరోయిన్ విషయంలో ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో టాల్ బ్యూటీ కృతి సనన్ పేరు మాత్రం కొద్ది రోజులుగా బాగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Kriti Sanon Fix for Prabhass Adipurush Movie

తాజా సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్'లో సీతగా కృతి సనన్‌నే తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు స్పష్టం చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని, అందులో ప్రభాస్ ప్రాజెక్టు కూడా ఒకటని తెలుస్తోంది. ఇక, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X