హలీవుడ్ రీమేక్‌లో కృతి సనన్.. ప్రభాస్‌తో ఆదిపురుష్ తర్వాత మరో బంపర్ ఆఫర్
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1: నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కృతి సనన్ భారీ ఆఫర్లను అందుకొంటున్నది. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మరో భారీ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానున్నారు.
హాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకొన్న కిల్ బిల్ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్నది. ఈ చిత్రంలో ఉమా తుర్మాన్ నటించిన పాత్రలో కృతిసనన్ కనిపించనున్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులను నిర్మాత, నటుడు నిఖిల్ ద్వివేది సొంతం చేసుకొన్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సినీ ప్రముఖుడు అనురాగ్ కశ్యప్ దర్వకత్వం వహిస్తున్నారు.

కిల్ బిల్ రీమేక్ గురించి చిత్ర యూనిట్ వెల్లడిస్తూ.. లాక్‌డౌన్‌లో అనురాగ్ కశ్యప్, నిఖిల్ ఇద్దరు స్క్రిప్టుపై పనిచేస్తున్నారు. ఇండియన్ నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నటించే నటీనటులు ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృతి సనన్ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు అని తెలిపారు.
కిల్‌బిల్ రీమేక్‌లో విలన్ ఛాయలు ఉండే హంతకురాలిగా కృతి సనన్ కనిపించబోతున్నారు. ఈ పాత్రలో అనేక రకాలుగా భావోద్వేగాలు ఉంటాయి. ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకొంటుంది అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
కృతి సనన్ కెరీర్ విషయానికి వస్తే... 1: నేనొక్కడినే చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించిన కృతి సనన్ ఆ తర్వాత దోచేయ్.. దిల్ వాలే, హౌస్‌ఫుల్ 4, పానిపట్, అంగ్రేజీ మీడియం చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన మిమీ, హమ్ దో హమారే దో, బచ్చన్ పాండే, భేడియా, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.


Click it and Unblock the Notifications











