తెలుగు నేర్చుకుంటోన్న బాలీవుడ్ బ్యూటీ: యంగ్ రెబెల్ స్టార్ కోసం కష్టపడుతోందట
తన సత్తాను నిరూపించుకుని తెలుగులో చాలా కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు 'ఆదిపురుష్' అనే హిందీ సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారానే అతడు బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ దీన్ని రూపొందిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా రామాయణంలో ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
'ఆదిపురుష్'లో హీరోయిన్‌గా టాల్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రను పోషిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు నేర్చుకుంటోందట. ఇందుకోసం ఓ ట్యూటర్‌ను కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోన్న ఈ భామ.. 'ఆదిపురుష్' తెలుగు వెర్షన్ కోసం కూడా తన గొంతును వినిపించాలని డిసైడ్ అయిపోయిందట. ఇందులో భాగంగానే తెలుగు భాషను సాన బడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ కూడా స్పష్టం చేసేశాడు.
అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

తెలుగు, హిందీలో స్వయంగా డైలాగులు పలికినా.. మిగిలిన భాషల్లో మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టుతో మేనేజ్ చేయబోతుందట కృతి సనన్. దీంతో అమ్మడి డెడికేషన్‌కు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











