twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెంచితే తప్పేమిటి? మగవాళ్లకు అది వర్తించదా? మహేష్‌బాబు హీరోయిన్ ఫైర్

    |

    సూపర్ స్టార్ మహేష్‌బాబుతో 1 నేనొక్కడి చిత్రంలో జతకట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కీర్తి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా టుడే సదస్సులో హీరోయిన్ల రెమ్యునరేషన్ల గురించి మాట్లాడుతూ బాలీవుడ్‌లో పాటిస్తున్న ద్వంద ప్రమాణాలపై దుయ్యబట్టారు. ఇంతకు కీర్తీ సనన్ ఏమన్నారంటే..

    ఇండస్ట్రీలో ద్వంద ప్రమాణాలు

    ఇండస్ట్రీలో ద్వంద ప్రమాణాలు

    ముంబైలో ఇండియా టుడే సదస్సులో భాగంగా ఐ ఫీల్ యూ గర్ల్: ఆన్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ క్రియేటివిటి అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ విషయంలో ఇండస్ట్రీలో ద్వంద ప్రమాణాలు ఉన్నాయి. సినిమాలో వారి ప్రతిభ, శ్రమ ఆధారంగా రెమ్యునరేషన్ ఉండాలి. అలాగే సినీ తారలకు ఉండే ప్రజాదరణను బట్టి కూడా రెమ్యునరేషన్ నిర్ధారించాలి అని కృతి సనన్ అన్నారు.

    పారితోషికం విషయంలో వివక్ష

    పారితోషికం విషయంలో వివక్ష

    హీరో, హీరోయినా అనే తేడా లేకుండా ప్రతిభను, వారి శ్రమను బట్టి పారితోషికం ఇవ్వాలి. మగవాళ్లతో పోల్చితే మహిళ కళాకారులు విషయంలో నాలుగు రెట్ల వివిక్ష కొనసాగుతున్నది. సినీ పరిశ్రమలో పురుషులు, మహిళల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ పద్దతి మారాలి. ఈ వివక్షకు ముగింపు పలకాలి. అప్పుడే పరిశ్రమలో ప్రతీ ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని కృతి సనన్ అన్నారు.

    హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు

    హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు

    గతంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నది. పీకూ, క్వీన్, రాజీ చిత్రాలను చూస్తే ప్రేక్షకులు అభిరుచి మారిందనే అభిప్రాయం కలుగుతున్నది. హీరోయిన్లు కూడా సొంత ప్రతిభతో రాణించి నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వివక్షను దూరం చేస్తాయి అని కృతి సనన్ పేర్కొన్నారు.

    మిమి చిత్రంలో కీలకంగా

    మిమి చిత్రంలో కీలకంగా

    గతంలో రొటీన్ పాత్రలకే పరిమితమైన కృతి సనన్ తాజాగా తన కెరీర్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. సరోగసి కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న మిమి అనే చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా హౌస్‌ఫుల్ 4, పానిపట్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

    English summary
    Bollywood actress Kriti Sanon rises voice on Bollywood remunerations. She said, There is pay discrimination in Industry. Remuneration should be paid on the talent and work they given.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X