ఆ హీరోయిన్ చెల్లెలి అందాలు చూస్తే షాకే..రచ్చ మొదలు కాబోతోంది..!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 1 నేనొక్కడినే తో ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఆ తరువాత నాగ చైతన్య దోచెయ్ చిత్రంలో నటించింది. రెండు చిత్రాలు విజయం సాధించలేదు. దీనితో బాలీవుడ్ బాట పట్టిన కృతి సనన్ అక్కడ కొన్ని చిత్రాల్లో మెరుపులు మెరిపించింది. ఈ పొడుగు సుందరి అందాలు యువతని ఆకర్షించే విధంగా ఉంటాయి. చిత్ర పరిశ్రమలో అక్క చెల్లెలు ఇద్దరూ సినిమాల్లో నటించడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఘటన కృతి సనన్ ఫ్యామిలిలో జరగబోతోంది. కృతి సనన్ చెల్లెలు నపూర్ సనన్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. కృతి సనన్ చెల్లెలు ఎవరంటూ యువత ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.

మహేష్ పక్కన లక్కీ ఛాన్స్
కృతి సనన్ తొలి చిత్రంతోనే మహేష్ పక్కన నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది. కానీ ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో టాలీవుడ్ లో పెద్దగా పాపులర్ కాలేదు. చైతు సరసన నటించిన దోచెయ్ చిత్రం కూడా నిరాశ పరచడంతో కృతి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.

బాలీవుడ్ లో అందాల మోత
సాధారణంగా దక్షణాది నుంచి వెళ్లిన ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ లో కాస్త అందాల జోరు పెంచడం మాములే. కృతి కూడా బాలీవుడ్ లో తన అందాలను ఆరబోసి అందరిని ఆకట్టుకుంది.

చెల్లెలు రంగంలోకి
అక్కా చెల్లెళ్ళు సినిమాల్లో కొనసాగడం అరుదే. కానీ అలా నటించిన అక్కా చెల్లెల్లు కొందమంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కృతి సనన్, ఆమె చెల్లెలు నపూర్ సనన్ చేరబోతున్నారు. నుపుర్ సనన్ త్వరలో సినిమాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది.

అక్కని మించిన ఘాటు అందాలు
అక్కని మించే అందాలు నపూర్ సనన్ సొంతం. యువతని ఆకట్టుకునేల ఆమె సౌందర్యం ఉంటుంది.

మోడలింగ్ తో మొదలు పెట్టి
నపూర్ సనన్ తన సోదరి కృతి సనన్ కు వలె మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. మెరుపుతీగ వలె సౌందర్యం ఉండడంతో తాజగా సినిమా అవకాశాన్ని అందుకుంది.

నుపుర్ ని లాంచ్ చేస్తున్న ప్రముఖ ప్రొడ్యూసర్
ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడిద్వాల త్వరలో నపూర్ సనన్ ని ఓ హిందీ చిత్రంతో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి చిత్రంతోనే నపూర్ సనన్ ప్రముఖ ప్రొడ్యూసర్ నిర్మాణం లో నటించే అవకాశం రావడం ఆమె అదృష్టం.

కుర్ర కారు హృదయాలు కొల్లగొట్టడం ఖాయం
నపూర్ సనన్ మోడల్ గా ఇప్పటికే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నుపుర్ ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే అభిమానులు లక్షల్లో ఉన్నారు. నపూర్ సనన్ అందాలు అలా ఉంటాయి మరి. సినిమాల్లోకి వచ్చాక మరింతగా ఈ అమ్మడు యువతని ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











