‘ఆదిపురుష్’ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: ముందుగా ఆమెతోనే మొదలు పెట్టబోతున్నారట

'ఈశ్వర్' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత నుంచి వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత ఫుల్ జోష్‌లో కనిపిస్తోన్న అతడు.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ స్టార్ హీరో మూడు, నాలుగు సినిమాలను చేస్తున్నాడు.

ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రామాయణం నాటి కథతో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఈ సినిమా షూట్ నిలిచిపోయింది. ఈ మధ్యనే చిత్రీకరణ పున: ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ లీక్ అయింది.

'ఆదిపురుష్' మూవీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి పోస్టర్ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో గత శ్రీరామ నవమికి ప్రభాస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది సాధ్యపడలేదు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేయబోతున్నారట. అందరి కంటే ముందుగా సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై చిత్ర యూనిట్ డిజైన్స్‌ను కూడా ఫైనల్ చేసేసిందట. అతి త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Kriti Sanon Sita First Look Coming From Adipurush

ఈ చిత్రంలో సీతగా టాల్ బ్యూటీ కృతీ సనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఈ క్రమంలోనే ముందుగా సీతాదేవితో ప్రమోషన్ మొదలు పెట్టాలని భావిస్తుందట చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే కొద్ది రోజుల్లోనే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదలబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాముడి పాత్రతో సమానంగా సీత రోల్‌ను కూడా డిజైన్ చేశాడట దర్శకుడు ఓం రౌత్. ఎంతో ఎమోషనల్‌గా ఉండే ఈ పాత్రకు ఎంతో మంది హీరోయిన్లను అనుకుని, కృతి సనన్ ఫైనల్ చేసుకున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ రాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో పాగా వేయాలని యంగ్ రెబెల్ స్టార్ ఆశిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X