For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    నేను భార్యకు గులామ్: మీటూ ఎఫెక్టుతో వాళ్ల ఉద్యోగాలు పీకేసిన నిర్మాత!

    |

    వివాదాస్పన వ్యాఖ్యలు, నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ నటుడు, నిర్మాత, క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ 'మీటూ' ఉద్యమం ఎఫెక్టుతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియా, దుబాయ్‌లో తన కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులందరినీ తొలగించాడు.

    కరీనా కపూర్‌తో నాలుగేళ్లుగా అఫైర్.. ఆమె నా గర్ల్‌ఫ్రెండ్ .. కమల్ ఖాన్ షాకింగ్ ట్వీట్

    ఈ విషయాన్ని కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ... 'నా భార్య ఆదేశాలు పాటించక తప్పలేదు' అని వెల్లడించారు. అంతే కాదు ఇకపై ఏ అమ్మాయితో పార్టీలకు వెళ్లవద్దని, వారితో మాట్లాడటం కూడా మానేయాలని తన భార్య చెప్పినట్లు తెలిపారు.

    నా భార్యకు నేను గులామ్

    నా భార్యకు నేను గులామ్

    ‘అవును ఇది వంద శాతం నిజం, నేను నా భార్యకు బానిసను(గులామ్)...ఆమె ఆదేశాలు పాటించక తప్పలేదు. ఇపుడు నా ఇండియా, దుబాయ్ కార్యాలయాల్లో ఫిమేల్ స్టాఫ్ లేరు. ఇకపై అమ్మాయిలతో మాట్లాడటాలు, వారితో పార్టీలు కూడా ఉండవు' అని ట్వీట్ చేశారు.

     తనుశ్రీ దత్తాతో ఉద్యమం ఉధృతం

    తనుశ్రీ దత్తాతో ఉద్యమం ఉధృతం

    పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనుశ్రీ దత్తా ఎఫెక్టుతో బాలీవుడ్లో మీటూ ఉద్యమం తీవ్రమైంది.

     బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు

    బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు

    తనుశ్రీ దత్తా ఇన్స్‌స్పిరేషన్ పలువురు బాలీవుడ్ నటీమణులు, సింగర్స్ ఈ ఉధ్యమంలో భాగం అయ్యారు. దీంతో వికాస్ బహెల్, సాజిద్ ఖాన్, అలక్ నాథ్, సుభాష్ ఘాయ్ లాంటి ప్రముఖులు సైతం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

     వివాదాలకు కేంద్ర బిందువుగా

    వివాదాలకు కేంద్ర బిందువుగా

    టాలీవుడ్లో ఆర్జీవీ తరహాలో... బాలీవుడ్లో కమాల్ ఆర్ ఖాన్ వివాదాలకు కేంద్ర బింధువు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదలైనపుడు కూడా పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

    English summary
    KRK took to Twitter and said that his wife "ordered" him to fire all the women employees in his offices and that he "followed her order". He also said that the "order" requires him not to party with girls or even talk to them.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more