స్మృతి ఇరానీ కెరీర్ ను కంగనా రనౌత్ నాశనం చేసిందా?
2024 లోకసభ ఎన్నికల ఫలితాలను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈసారి కూడా కేంద్రంలో మోడీకే అధికారాన్ని కట్టబెట్టారు మెజారిటీ జనాలు. మరోవైపు బిజేపి తరపున ఫస్ట్ టైమ్ ఎన్నికల బరిలోకి దిగిన కంగనా భారీ మెజార్టీతో విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే కంగనా స్మృతి ఇరానీ కెరీర్ ను నాశనం చేసింది అనే టాక్ నడుస్తోంది. ఇంతకీ కంగనా స్మృతి ఇరానీ కెరీర్ ను ఎలా నాశనం చేసింది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
రాజకీయ నాయకులతో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో కంగనా రనౌత్, హేమమాలిని బిగ్గెస్ట్ సక్సెస్ సాధించారు. మరోవైపు ఒకప్పుడు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన స్మృతి ఇరానీ మూడోసారి ఎన్నికల రంగంలోకి దిగి హ్యాట్రిక్ విజయాలపై ఆశలు పెట్టుకుంది.

కానీ ఈసారి స్మృతి ఇరానీ దారుణంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఓ బాలీవుడ్ ప్రముఖుడు స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ ట్విట్టర్‌లో కంగనాకు శుభాకాంక్షలు తెలిపాడు. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించింది. దీనిపై బాలీవుడ్ నటుడు, సెల్ఫ్ స్టైల్ క్రిటిక్ కేఆర్కే ట్వీట్ చేశారు. కంగనా గెలిచినందుకు అభినందనలు తెలుపుతూ, తక్కువ ఓట్లు వచ్చినందుకు నటి స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశాడు.
కమల్ ఆర్ ఖాన్ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఫలితాల వెల్లడికి ముందే ప్రధాని మోదీ విజయంపై ఆయన అభినందనలు తెలిపి హాట్ టాపిక్ అయ్యాడు. ఫలితం రాగానే రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. అలాగే స్మృతి ఇరానీపైనా విమర్శలు చేశారు.
స్మృతి ఇరానీ కెరీర్‌ను కంగనా నాశనం చేసిందని కేఆర్కే చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేఆర్కే తన పోస్ట్‌లో 'అభినందనలు మేడమ్ స్మృతి ఇరానీ జీ. మీరు ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్త చేతిలో ఓడిపోయారు. కంగనా రనౌత్ గెలిచింది. కాబట్టి ఈ రోజు కంగనా మీ కెరీర్‌ను నాశనం చేసింది. బై టాటా! బై!' అంటూ ట్రోల్ కేశాడు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు రాహుల్ గాంధీయే భారతదేశ భవిష్యత్తు అని నిర్ణయించారు. మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ ఒంటరిగా నిలిచారు. అభినందనలు రాహుల్ భాయ్ అంటూ కేఆర్కే చేసిన మరో పోస్ట్ కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. కెఆర్‌కె సినిమాలే కాకుండా రాజకీయాల గురించి కూడా తరచూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు.
ఎక్కువగా తన పోస్ట్‌లతో బాలీవుడ్ తారలను టార్గెట్ చేస్తారు. సల్మాన్ ఖాన్ ను కూడా అతను చాలాసార్లు టార్గెట్ చేశాడు. బాలీవుడ్ కు సంబంధించిన చీకటి బాగోతాలను ఎప్పటికప్పుడు బయట పెడతాడు. కానీ బాలీవుడ్ ప్రముఖులు అతన్ని అస్సలు ఖాతరు చేయరు. కానీ ఈసారి ఎన్నికల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











