సౌత్ సినిమాపై నోరుపారేసుకొన్న హృతిక్ తండ్రి.. ప్రశాంత్ నీల్‌పై అనుచిత వ్యాఖ్యలు
ఇప్పుడు మాత్రమే పాన్ ఇండియా సినిమా అంటే చాలా మందికి తెలిసింది మన తెలుగు సినిమా నుంచే కావచ్చు కానీ ఎప్పుడు నుంచో పాన్ ఇండియా సినిమాలు అందిస్తున్న ఇండస్ట్రీగా బాలీవుడ్ సినిమా ఒకడుగు ముందే ఉండేది అని చెప్పాలి. కాగా ఇండియా ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువగా టచ్ చేసిన ఫేమస్ జానర్ లలో సూపర్ హీరో జానర్ కూడా ఒకటి.
కాగా ఇందులో ఒక అద్భుతమైన సినిమాల లిస్ట్ వచ్చింది అంటే మన తెలుగు ఆడియెన్స్ కి కూడా ఎంతో ఇష్టమైన సూపర్ హీరో మన ఇండియన్ సినిమాకి అంటూ ఉన్న సూపర్ హీరో ఎవరు అంటే అది క్రిష్ అనే చెబుతారు. బాలీవుడ్ అందగాడు మ్యాచో మ్యాన్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలకి సెపరేట్ క్రేజ్ ఉంది. అప్పట్లోనే వచ్చిన క్రిష్ సినిమా హాలీవుడ్ సినిమాలని తలదన్నే గ్రాఫిక్స్ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లతో కలిపి ఉంది.

కాగా ఈ సినిమాని హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ కథ రాసి దర్శకత్వం వహించారు. కాగా అప్పట్లోనే బియాండ్ ఆలోచనలు కలిగిన తనలాంటి దర్శకుడు ఇపుడు మన సౌత్ సినిమా విషయంలో సంచలన కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది. కాగా రాకేష్ రోషన్ ఏమన్నారంటే ఇపుడు సౌత్ లో చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించవచ్చు కానీ వాటిలో ఎందుకు నల్లగా చిత్రీకరిస్తున్నారో అర్ధం కావట్లేదు అంటూ సెటైర్స్ వేశారు.
అలాగే ఇలాంటి సినిమాలు చూసినపుడు థియేటర్ నుంచి బయటకొచ్చి ఆక్సిజన్ పీల్చుకోవాలా అన్నట్టు మారాయి అంటున్నారు. అలాగే సౌత్ సినిమాలు టెక్నీకల్ గా పరిణితి చెందుతున్నాయి కానీ స్టోరీ టెల్లింగ్ పరంగా మాత్రం ఇంకా మారలేదు, ఇంకా అదే పాత ఫార్ములాల దగ్గరే ఆగిపోయారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.

కాగా సౌత్ నుంచి ఈ మధ్య కాలంలో మెయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలు ఇలా డార్క్ థీమ్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ సినిమాలపై బొగ్గులు అంటూ చాలా ట్రోల్స్ కూడా ఉన్నాయి. మరి బహుశా వీటినే ఉద్దేశించి అన్నారు కాబోలు. మరి వీటిపై మన సౌత్ నుంచి ఏమన్నా రిప్లైలు తనకి వెళ్తాయో లేదో చూడాలి మరి. ఒకో దర్శకునికి ఒకో స్టైల్ టేకింగ్ ఉంటుంది.
అలాగే ప్రశాంత్ నీల్ కూడా తనకి ఎక్కువ రంగులు చూడడం ఇష్టం ఉండదు అని అందుకే తన సినిమాలో ఎక్కువగా నలుపు థీమ్ లోనే సెట్ చేసుకుంటానని అలాగే బ్యాట్ మ్యాన్ లాంటి డార్క్ థీమ్స్ లోనే సినిమాలు చేయడం ఇష్టపడతానని ఆ మధ్య చెప్పుకొచ్చాడు. మరి రాకేష్ రోషన్ లాంటి దర్శకుడు ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి.
ఇక ఇది పక్కన పెడితే ప్రస్తుతం తన దర్శకత్వంలో క్రిష్ 4 కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇపుడు హృతిక్ జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న బిగ్ యాక్షన్ సీక్వెల్ వార్ 2 తర్వాత ఈ సినిమానే మొదలు పెట్టనున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











