జోరుగా రూమర్లు.. ఒకే మాటతో తెరదించిన కరణ్ జోహర్
భారతీయ సినిమా పరిశ్రమలో సీక్వెల్స్ హవా నడుస్తున్నది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా బయోపిక్స్, ప్రీక్వెల్స్, సీక్వెల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత కొద్దిరోజులుగా ఓ వార్త వైరల్‌గా మారింది. అదేమిటంటే పదేళ్ల క్రితం వచ్చిన కుచ్ కుచ్ హోతా హై అనే చిత్రానికి కరణ్ జోహర్ స్వీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నారు అని ఓ వార్త విస్తృతంగా ప్రచారమైంది. కరణ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, రాణి ముఖర్జి, కాజోల్ నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నేను కుచ్ కుచ్ హోతా హై సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేయడం లేదు అని ట్విట్టర్‌లో కరణ్ స్పష్టం చేశాడు. ఓ వెబ్‌సైట్ రాసిన వార్తకు లింక్‌ను కోట్ చేస్తూ రూమర్లకు తెరదించారు.

ప్రస్తుతం ఓ చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందించే పనిలో కరణ్ జోహర్ బిజీగా ఉన్నారు. రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, అలియాభట్, జాన్వీ కపూర్, అనిల్ కపూర్‌తో కలిసి తఖ్త్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మొగల్ పాలనలో కనిపించే కభీ కుషీ కభీ ఘమ్ అనే చిత్రం మాదిరిగా ఉంటుంది అని కరణ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











