twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో దృశ్యం2 రీమేక్.. లీగల్ నోటీసులు జారీ చేసిన నిర్మాణ సంస్థ.. అసలేమైందంటే?

    |

    ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఒకసారి ఒక భాషలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను దాదాపు మిగతా అన్ని భాషల్లో రీమేక్ చేయడానికి ఆయా భాషల దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగా చాలా తెలుగు సినిమాలు ఇతర భాషలలోకి రీమేక్ కాగా ఇతర భాషల సినిమాలు సైతం తెలుగులో రీమేక్ అవుతున్నాయి..

    Recommended Video

    Drishyam 2 Remake Runs Into Trouble || Filmibeat Telugu

    ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగిపోతోంది. అయితే నిన్న మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం 2 హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించిన సినిమా నిర్మాణ సంస్థ చిక్కుల్లో పడిందని టాక్ వినిపిస్తోంది ఆ వివరాల్లోకి వెళితే..

    హిందీలో రీమేక్

    హిందీలో రీమేక్

    మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం సినిమా దాదాపు అన్ని భాషల్లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే.. ఇదే కోవలో దృశ్యం పార్ట్ వన్ హిందీలో అజయ్ దేవగన్, శ్రియ, టబు కీలకపాత్రల్లో తెరకెక్కించారు. ఇక రెండో పార్ట్ కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాని కూడా తామే తెరకెక్కించాలని మొదటి పార్ట్ రీమేక్ చేసిన రెండు సంస్థల్లో ఒక సంస్థ హక్కులు కొనుక్కుంది.

    అప్పటి సంస్థే

    అప్పటి సంస్థే

    పనోరమా స్టూడియోస్ సంస్థ 'దృశ్యం' సీక్వెల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మలయాళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాని కమిట్ మెంట్ తో, ప్యాషన్ తో రీమేక్ చేయాలని, అది తమకు ఉందనే విశ్వాసంతో హిందీ హక్కులను తీసుకున్నామని పనోరమా సంస్థ అధినేతలు కుమార్ మంగత్ పాతక్, అభిషేక్ పాతక్ తెలిపారు.

    కానీ మరో సంస్థను సంప్రదించకపోవడంతో

    కానీ మరో సంస్థను సంప్రదించకపోవడంతో

    నిజానికి ఈ సినిమా మొదట భాగాన్ని నిషికాంత్ కామత్ తెరకెక్కించారు. ఆ సమయంలో పనరోమా బ్యానర్ తో పాటు వాయాకామ్ 18 సంస్థ కూడా నిర్మించింది. కానీ నిన్న సదరు సంస్థతో ఏమాత్రం సంప్రదింపులు జరపకుండా ఈ సినిమా ప్రకటన చేశారని తెలుస్తోంది. ఈ నేపద్యంలో వాయాకామ్ 18 సంస్థ ఇప్పుడు పనరోమా సంస్థ మీద లీగల్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

    చేస్తే మాతో చేయాలి లేదంటే లేదు

    చేస్తే మాతో చేయాలి లేదంటే లేదు


    సినిమా చేస్తే తమతో కలిసి చేయాలని లేదా చేయకూడదు అని సదరు సంస్థ ప్రతినిధులు వాదిస్తున్నారు. అయితే మొదటి భాగం చేస్తున్న సమయంలోనే రెండు సంస్థల మధ్య ఒప్పందం ఉందని అందుకే ఈ డిమాండ్ చేస్తున్నామని వారు అంటున్నారు. అయితే ఈ అంశం మీద ఇంకా పనరోమా బ్యానర్ వాళ్ళు స్పందించలేదు. మరి చూడాలి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో ?

    అప్పటి వాళ్లే ఉంటారా ?

    అప్పటి వాళ్లే ఉంటారా ?

    ఆరేళ్ళ క్రితం వచ్చిన హిందీ రీమేక్ లో అజయ్ దేవ్ గన్, శ్రియ జంటగా నటించారు. టుబు పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. అయితే... ఇప్పుడు వాళ్ళతోనే తీస్తున్నారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరో పక్క తెలుగు 'దృశ్యం -2'ను డైరెక్ట్ చేస్తున్న మలయాళ ఒరిజినల్ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్... ఈ సినిమా హిందీలోనూ రీమేక్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

    English summary
    Yesterday Kumar Mangat has announced the remake of Drishyam 2 and his collaboration with Panorama Studios for the same. But reports says that legal lawsuit is filed against Mangat by Viacom 18 Motion Pictures for announcing film without their consent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X