సుశాంత్ నాకు సోదరుడితో సమానం.. ఆమెతో ఆ రిలేషన్ లేదు.. రూమర్స్ పై యువ నటుడు ఆగ్రహం
బాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సుశాంత్ రాజ్ పుత్ మర్డర్ మిస్టరీపై రోజుకో అనుమానం పుట్టుకొస్తోంది. సుశాంత్ మరణించి రెండు నెలలు పూర్తికావస్తున్నా కూడా ఇంకా సరైన సమాధానం దొరకలేదు. జనాల్లో ఉన్న ఎన్నో సందేహాలను క్లియర్ చేయడానికి ఇప్పటికే సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తుని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో రోజుకో కొత్త పాయింట్ ని బాలీవుడ్ మీడియా కూడా బాగానే హైలెట్ చేస్తోంది.

సుశాంత్ స్నేహితులపై ఫోకస్..
ఒకవైపు సీబీఐ అధికారులు ఇన్వెస్టిగేషన్ లో బిజీగా ఉండగా మరోవైపు టాప్ నేషనల్ మీడియా సంస్థలు కూడా సుశాంత్ మృతికి గల కారణాలను వెతికే పనిలో పడ్డాయి. అయితే ఇలాంటి సమయంలో సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్, అలాగే దగ్గరగా ఉండే స్నేహితులను, సన్నిహితులను కూడా నార్త్ మీడియా వదలడం లేదు. వారికి సంబంధించిన ఎదో ఒక న్యూస్ ని హైలెట్ చేయడంతో బాలీవుడ్ స్టార్స్ లో కొంత ఆందోళన మొదలైంది.

సుశాంత్ మాజీ ప్రేయసితో..
ఇక రీసెంట్ గా కుశాల్ టాండన్ అనే నటుడిపై కూడా పలు ఆరోపణలు వచ్చేలా కథనాలు వెలువడ్డాయి. సుశాంత్ మాజీ గర్ల్ అంకిత లోఖండేతో అతడు ప్రేమ వ్యవహారం నడిపాడని న్యూస్ రావడంతో కుశాల్ టాండన్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఒక జర్నలిజం అనే వృత్తికి మీరు న్యాయం చేస్తున్నారా లేదా అనే విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించే ప్రయత్నం చేశాడు.

అతని వల్లే బ్రేకప్..?
ఒక ప్రముఖ వెబ్ సైట్ లో సుశాంత్, కుశాల్ టాండన్ కి మధ్య కూడా విభేదాలు ఉన్నాయని కథనాలు వెలువడ్డాయి. కుశాల్ స్నేహితుడే అయినప్పటికీ అతని వల్లే సుశాంత్ తన మొదటి ప్రేయసి అంకిత నుంచి విడిపోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. దీంతో కుశాల్ అందులో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు.
Recommended Video

సిగ్గుపడాల్సిన విషయం..
నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. సుశాంత్, అంకితలకు నేను మంచి ఫ్రెండ్ ని మాత్రమే. ఆమెతో మరో రిలేషన్ ఏమి లేదు. సుశాంత్ నా సోదరుడితో సమానం. నేను ఎందుకు అలా చేస్తాను. నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పిచ్చిరాతలు రాయడం ఎంతవరకు న్యాయం. ఇదేనా జర్నలిజం అంటే? మరోసారి ఈ బ్లెమ్ గేమ్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నిజంగా ఈ వార్త నన్ను షాక్ కి గురి చేసింది అని కుశాల్ మండిపడ్డాడు.


Click it and Unblock the Notifications











